Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుప్రేమతో నీ పెదనాన్న… నారా రోహిత్ కు సీఎం చంద్రబాబు లేఖ

ప్రేమతో నీ పెదనాన్న… నారా రోహిత్ కు సీఎం చంద్రబాబు లేఖ

ఇటీవల సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఆయన సోదరుడి కుమారుడు, సినీ నటుడు నారా రోహిత్ భావోద్వేగభరితంగా ఓ లేఖ రాయడం తెలిసిందే. 40 ఏళ్లుగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, రాజకీయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని కూడా ధైర్యంగా నిలబడ్డారని నారా రోహిత్ ఆ లేఖలో కొనియాడారు. గత ఐదేళ్లుగా ఎంతో వేదన అనుభవించారని, కానీ పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకున్నారని తెలిపారు.
నారా రోహిత్ లేఖపై చంద్రబాబు నేడు స్పందించారు. “ప్రియమైన నారా రోహిత్… నీ లేఖ నా మనసును హత్తుకుంది. మన కుటుంబ సభ్యుల అండ, ఆశీస్సులు ఎల్లవేళలా నాకు ఉన్నాయి కాబట్టే… ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడగలిగాను. నీకు ఎల్లప్పుడూ నా శుభాశీస్సులు వెన్నంటి ఉంటాయి… ప్రేమతో నీ పెదనాన్న” అంటూ చంద్రబాబు బదులిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article