తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారికి మనవడి పుట్టు వెంట్రుకలను సమర్పించారు. ఆ తర్వాత ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి తన భార్య, కూతురు, అల్లుడితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది.