Thursday, September 11, 2025

Creating liberating content

తాజా వార్తలువైసీపీలో చేరికల వెల్లువ

వైసీపీలో చేరికల వెల్లువ

కదిరి :రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం నిర్వహిస్తున్న ప్రచారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది. ఒకవైపు ప్రచారంలో దూసుకెళ్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ కి మహిళలు హారతులు పట్టి పూలమాలతో ఘన స్వాగతం పలుకుతుండగా, మరోవైపు జగనన్న పాలనకు ఆకర్షితులై టీడీపీ నుంచి వైసీపీలో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందులో భాగంగా శనివారం మండల పరిధిలోని మద్దివారిగొంది పంచాయతీ కమతంపల్లి గ్రామంలో సర్పంచ్ నాగభూషన్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, లక్ష్మీ నర్సు, వెంకట రమణ, మహమ్మద్ షరీఫ్, నజిముద్దీన్, ఆలం వలి, నబిరసుల్, హరుణ్, అల్లిసాబ్, అమానుల్లా, భాషా, ఖాదర్ వలీ, మస్తాన్, రహమతుల్లా తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ కండువ వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ.. సీఎం జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలకు అక్షితులై పార్టీలు చేరిన వారందరికీ అభినందనలు తెలిపారు. అదేవిధంగా టీడీపీ నాయకుల దురాగతాలను ఎండగడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ విశేష కృషి చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులతో పాటు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article