టాప్ న్యూస్వీరు పోలీసులా...?

వీరు పోలీసులా…?

*నాగరాజుకంటే …కాట్రాజు అంటే… .
*సర్కిల్ ఇన్స్పెక్టర్ కంటే కసాయివాడని అనొచ్చునేమో…!
*సాయి కృష్ణ ను చంపేశారు…
*శవాన్ని కూడా దహనం చేశారు…
*నేరం చేస్తే ఇంత కిరాతకంగా చంపుతారా…
*కస్టడీలో తనను హింసిస్తారని సిఐ నాగరాజు సిట్ పై కోర్టు కు వెళ్ళచ్చు …
*అతని హింస కు ఇతరులు చావచ్చు…
*ఇతగాడిదొ క్కడిదే ప్రాణమా…
*సామాన్యూల ప్రాణాలంటే అంత చులకనా…
*చట్టాలుండే దెందుకు చాపకింద మడిచి పెట్టుకోవడానికా…
*ఇదేమి నీతి మాలిన ధర్మం..పనికిమాలిన న్యాయం…
*ఇలాంటి అధికారికి ఏ శిక్ష వేస్తారో…
*ప్రభుత్వాలు ఇలాంటి వారిని ఏమి చేస్తాయి…
*చట్టాలు చేసే వారు ఈ క్రూర మృగాలను కఠినంగా శిక్షిస్తారా…
*ఇంత జరుగుతుంటే ఉన్నతాధికారులు ఊరికే ఉన్నారా…
*నిఘా వ్యవస్థలు నిద్ర పోయాయా..నిద్ర పోయినట్లు నటించాయా…
*టాస్క్ పోర్స్ వారి మాటేమిటి…
*డాక్టర్,యాక్టర్ ఓకే టాస్క్ పోర్స్ పుణ్యం చేసిందా..
*సింగ్ నగర్లో సానుభూతి పరులు అండ ఒకటి…
*కోటా బియ్యం కొట్టేసే వాడు , బ్రాందీ అమ్ముకునే వారు ధర్నాలు మరీను…
*అగ్ని సినిమాలో సాయి కుమారంత కవరేజ్…
*ఈ ఖాకీలను కూడా ఇలానే చేస్తే …?
(రామమోహన్ రెడ్డి)
నవ్యాంధ్రప్రదేశ్ లో గత కొన్ని నెలల క్రితం తీవ్ర చర్చనీయాంశంగా మారి అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు మధ్య జరిగిన మాటల యుద్ధం, అధికార పార్టీ కి శాంతి భద్రతల విషయంలో ఎదురైన పరిణామం,విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ మొదట మిస్సింగ్ కేసు, ఆపై చంపేశాడనే ఆరోపణల నేపధ్యం లో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు సిట్ విచారణ కు ఆదేశించడం సిట్ విచారణ చేపట్టిన తర్వాత సీఐ నాగరాజు అరెస్ట్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న విషయాలు చూస్తుంటే అసలు వీరు పోలీసులా నరరూప రాక్షసులా అనడం కంటే అతి క్రూరమైన మృగాల కంటే దారుణ మైన వ్యక్తులుగా పరిగణించినా తప్పేమి కాదనే భావన వ్యక్తం అవుతోంది.ఒక వ్యక్తి నేరగాడు కావచ్చు,ఆ నేరాలు సభ్య సమాజం జీర్ణించుకోలేక పోవచ్చు అయితే అందుకు చట్టం న్యాయం అనేవి ఇంకా బ్రతికే ఉన్నాయి.పూర్తిగా చచ్చిపోలేదు.ఒక వేళ న్యాయం అన్నది అంగడిలో సరుకు అయినప్పటికీ చట్టం అయిన వారికి చుట్టం అయినప్పటికీ కానీ వారికి మరణ శాసనం అన్నది ఈ భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఇంకా అమలులోకి రాలేనందున క్రూరంగా కొట్టి చంపే విధానాలు అనేవి అత్యంత దుర్మార్గమైనవి గా పరిగణించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ సమాజానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా సగటు మనిషి ప్రశాంతంగా జీవించడానికి కొన్ని రక్షణ వ్యవస్థలు ఏర్పాటు కాబడీ ఉన్నాయి.వాటిలో పనిచేసే వారు కూడా మనుషులే అన్న విషయం మరువకూడదు.సమాజ భద్రత పట్ల పోలీసు శాఖ కొంత కటిన వైఖరిని అవలబించక తప్పదు అట్లని కాటికి పంపే వైఖరి అన్నది సరైన విధానం కాదు.అయితే ప్రస్తుతం రోజు రోజుకు మలుపు తిరుగుతున్న రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణ ఉదంతం యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని ఆలోచింప చేయడంతో పాటు ఖాకీలు కళ్ళు నెత్తికెక్కి కొట్టుకున్న తీరు ను చూసి కొంత భయాందోనలలు చోటుచేసుకుంటున్నాయని చెప్పక తప్పడం లేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే…ఒళ్ళు గగుర్పాటు చెందే విషయాలు బహిర్గతం అవుతున్నాయి.
విజయవాడ కృష్ణలంక మాజీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌.ఎస్‌.వి.వి. నాగరాజు ప్రస్తుతం తీవ్రమైన కస్టోడియల్ మరణం , హత్యారోపణల కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. గాదె సాయికృష్ణ అనే యువకుడిని అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలు పెట్టి హత్య చేశారనే ఆరోపణలపై జూన్ 2026లో నాగరాజును పోలీస్ శాఖ సస్పెండ్ చేసి, అనంతరం అరెస్ట్ చేసింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 2026 సెప్టెంబరులో కీలక నివేదికను వెల్లడించింది. సాయికృష్ణ మరణం పోలీస్ స్టేషన్‌లో జరగలేదని, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణిగారితోటలోని ఒక పాడుబడిన బంగ్లాలో సీఐ నాగరాజు మరియు ఇతర సిబ్బంది సాయికృష్ణను దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపినట్లు సిట్ తేల్చింది.ఈ ఘాతుకాన్ని కప్పిపుచ్చడానికి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని సిసిటివి ఫుటేజీలు, హార్డ్ డిస్క్‌లను మే 1 నుండి జూన్ 1 మధ్య కాలానికి గాను డిలీట్ చేసి మార్చారని దర్యాప్తులో వెల్లడైంది. మృతదేహాన్ని కూడా మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.సాక్ష్యాలను మాయం చేసేందుకు, మృతుడి కుటుంబ సభ్యులు హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను వెనక్కి తీసుకునేలా బెదిరించేందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సురేష్‌ను (A4) కూడా పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు .సాయికృష్ణ కేసుతో పాటు, క్రాంతి కుమార్ అనే మరో యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ తీసుకున్న సెల్ఫీ వీడియోలో సీఐ నాగరాజు వేధింపులే కారణమని పేర్కొనడంతో, నాగరాజుపై SC/ST అట్రాసిటీ మరియు ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు అదనంగా మరో కేసు నమోదైంది.ప్రస్తుతం మాజీ సీఐ నాగరాజు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో జుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
అయితేసిట్ (SIT) కోర్టుకు సమర్పించిన తాజా రిమాండ్ రిపోర్ట్ ప్రకారం, కేసును తప్పుదోవ పట్టించడానికి నిందితులు చేసిన తీవ్రమైన ప్రయత్నాలు వెలుగులోకి వచ్చాయి. మే 31న, సీఐ నాగరాజు ఆదేశాల మేరకు ఏ4 నిందితుడైన సురేశ్, కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి సాయికృష్ణ మేనమామ (ముళ్ళపూడి నవరంగ్) ఇంటికి వెళ్ళి హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటే భారీ మొత్తంలో పరిహారం (డబ్బు) ఇస్తామని బాధితుడి కుటుంబానికి ఆఫర్ చేశాడని. అయితే, సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఆ ప్రతిపాదనను మరియు డబ్బును పూర్తిగా తిరస్కరించారని సిట్ తన నివేదికలో పేర్కొంది.
అంతకు ముందు మే 12-13 మధ్య అర్ధరాత్రి సమయంలో సాయికృష్ణ చనిపోగా, అతని మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి, మోటార్ సైకిల్‌పై ‘స్వర్గపురి’ శ్మశానవాటికకు తరలించి . సీఐ నాగరాజు, అశోక్, సురేశ్‌లు శవం పూర్తిగా బూడిదయ్యే వరకు శ్మశానంలోనే ఉండి కాల్చేశారని ,మే 18న ఆధారాలు ఏమైనా మిగిలాయేమో చూడటానికి సురేశ్ మళ్లీ శ్మశానానికి వెళ్లారని నేడు లొంగిపోయిన సురేశ్‌ ద్వారా ఈ కేసులో కొత్త కోణాన్ని సిట్ తన దర్యాప్తు నివేదిక ను కోర్టుకు సమర్పించగా నిందితుడు సురేష్ కు సెప్టెంబర్ 24 వరకు జుడీషియల్ రిమాండ్‌కు పంపడంతో, అతనిని ప్రస్తుతం నూజివీడు జైలుకు తరలించారు.
ఇప్పటివరకు సాయికృష్ణ మృతదేహం ఆనవాళ్లు లేవని భావించిన సిట్ అధికారులకు విజయవాడలోని ‘స్వర్గపురి’ శ్మశానవాటికను క్షుణ్ణంగా పరిశీలించగా సాయికృష్ణ మృతదేహాన్ని రహస్యంగా దహనం చేయడానికి ఉపయోగించిన సిమెంట్ ప్లాట్‌ఫామ్ నంబర్ 16 ను సిట్ గుర్తించింది. అక్కడ లభించిన బూడిద, ఎముకల ముక్కలను స్వాధీనం చేసుకుని, తదుపరి ల్యాబ్ పరీక్షల కోసం పంపినట్లు తెలుస్తోంది.దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ఏ4 సురేశ్ తన మొబైల్ ఫోన్‌ను సైతం పూర్తిగా నాశనం చేసి పరారయ్యాడని కోర్టుకు సిట్ నివేదిక ఇచ్చినట్లు వివరించారు.

అయితేకీలక నిందితుడు ఏ4 సురేశ్ సెప్టెంబర్ 17న లొంగిపోయిన తర్వాత, శనివారం కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో సిట్ తన పాత దర్యాప్తు కథనాన్ని మార్చింది. గతంలో సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోపలే మరణించాడని భావించగా, తాజా నివేదిక ప్రకారం సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిలు సాయికృష్ణను పోలీస్ స్టేషన్ ఆవరణలో కాకుండా కృష్ణలంకలోని ఒక పాడుబడిన/ఖాళీ భవనంలో ఉంచి విచక్షణారహితంగా కొట్టారని, ఆ హింస భరించలేకే అతను అక్కడే మరణించాడని సిట్ స్పష్టం చేసింది.దీంతో సాయికృష్ణ కేసులో కీలక సాక్ష్యాలు సిట్ కు లభించినట్లయిందని అనుకోవాలి.
సాయికృష్ణ కేసు కేవలం ఖాకీల వరకే పరిమితం కాకుండా ఇదొక రాజకీయ పరమైన అంశంగా మారడం ఇదే సిఐ నాగరాజు కు సంబంధించి మరో మరణం కూడా బైటికి రావడం పెను దుమారం రేపిన క్రాంతి కుమార్ కేసు తో నాగరాజు మరియు అతని నేరమయ సామ్రాజ్యం లో పాలు పంచుకున్న వారికి మరింత ఉచ్చుబిగిస్తోందని చెప్పాలి.రౌడీషీటర్ అయిన గాదె సాయికృష్ణ ను మే 6, 2026 న మార్కాపురం నుండి టాస్క్‌ఫోర్స్ మరియు కృష్ణలంక పోలీసులు విజయవాడకు తీసుకువచ్చారు. సీఐ నాగరాజు ఆధ్వర్యంలో సాయికృష్ణను కోర్టులో ప్రవేశపెట్టకుండా, పోలీస్ స్టేషన్‌లో కాకుండా ఒక పాడుబడిన భవనంలో అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా కస్టోడియల్ టార్చర్ (మూడో డిగ్రీ) చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది.ఆ సంఘటన అలా ఉండగానే
ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడైన పేరుపోగు క్రాంతి కుమార్ అనే దళిత యువకుడి బలవన్మరణం ఈ కేసులో అత్యంత తీవ్రమైన మలుపుగా మారింది.క్రాంతి కుమార్ పురుగుల మందు తాగే ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. “నా చావుకు కృష్ణలంక సీఐ నాగరాజే కారణం. నేను మాదిగ సామాజిక వర్గానికి చెందడమే నేను చేసిన తప్పు. మూడు నెలలుగా నన్ను వేటాడి, వెంటాడి మరీ కొడుతున్నారు, తీవ్రంగా వేధిస్తున్నారు. నేనిక బతకలేను” అని క్రాంతి కుమార్ ఆ వీడియోలో కన్నీళ్లతో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సూసైడ్ వీడియో ఆధారంగా జూలై 2026 లో పోలీసులు సీఐ నాగరాజుపై కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో మరో కొత్త కేసు నమోదు చేశారు. ఆయనపై ఆత్మహత్యకు ప్రేరేపించడం తో పాటు తీవ్రమైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద సెక్షన్లు జోడించి, ఆయన్ను ఈ కేసులో ఏ1 గా చేర్చారు.అయితే క్రాంతి కుమార్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆ సూసైడ్ వీడియో యొక్క డిజిటల్ విశ్వసనీయతను నిరూపించడానికి దానిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ (FSL) కు పంపించారు.క్రాంతి కుమార్ భార్య ప్రభావతి పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో, తన భర్తను స్టేషన్‌కు పిలిచిన ప్రతిసారీ తాళ్లతో చేతులు కట్టి, ఒళ్లంతా కుళ్లబొడిచి తీవ్రంగా హింసించేవారని ఆరోపించారు. ఇవన్నీ కూడా గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీఐ నాగరాజుకు కుడిభుజంగా వ్యవహరించిన ప్రైవేట్ వ్యక్తి సురేశ్ (ఏ4) లొంగుబాటు తర్వాత సిట్ విచారణ వేగవంతమైంది.సాయికృష్ణ పోలీసుల టార్చర్‌కు చనిపోయిన తర్వాత, ఆ శవాన్ని విజయవాడ దాటించి రహస్య శ్మశానవాటికలో దహనం చేయడంలో, దానికి సంబంధించిన ఖర్చులను మరియు ఆధారాలను నడిపించడంలో సురేశ్ ప్రధాన సూత్రధారి అని సిట్ నిర్ధారించింది. సురేష్ అరెస్ట్ తర్వాత సిట్ అధికారులుకృష్ణలంక పరిధిలో సీఐ నాగరాజు చేసిన సెటిల్‌మెంట్లు, అక్రమ వసూళ్ల డబ్బు అంతా సురేశ్ ఖాతాల ద్వారానే చేతులు మారినట్లు గుర్తించింది. దీనిపై సురేశ్ బ్యాంక్ ఖాతాలను, కాల్ డేటాను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.అలాగేకృష్ణలంక సీఐగా పనిచేసిన కాలంలో నాగరాజు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు, భూ దందాలకు మరియు సెటిల్‌మెంట్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి:ప్రాథమిక నివేదికల ప్రకారం, కోనసీమ ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల నాగరాజు పేరిట, అతని బినామీల పేరిట దాదాపు ₹100 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు సమాచారం లభించినట్లు గా తెలుస్తోంది. బాధితులను బెదిరించి వసూలు చేసిన లంచాలు, సివిల్ సెటిల్‌మెంట్ల డబ్బును ఏ4 సురేశ్ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి మరియు ఇతర ఆస్తుల్లోకి నాగరాజు మళ్లించినట్లు యాంటీ కరప్షన్ బ్యూరో మరియు సిట్ సంయుక్తంగా ఆధారాలు సేకరిస్తున్నాయి. దానితో పాటు క్రాంతి కుమార్ కేసులో ప్రభుత్వం కదలికదళిత యువకుడు క్రాంతి కుమార్ సీఐ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడనే దానికి బలమైన సాక్ష్యంగా ఉన్న సెల్ఫీ వీడియో ల్యాబ్ నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. ఈ కేసులో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిబంధనల ప్రకారం బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక ఉపశమనం మరియు న్యాయ సహాయం అందించే ప్రక్రియ కూడా పరిశీలనలో ఉంది.ప్రస్తుతం ప్రధాన నిందితుడైన మాజీ సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా, దర్యాప్తు సంస్థలు డిజిటల్ సాక్ష్యాలు (డిలీట్ చేసిన ఫోటోలు, సీసీటీవీ ఫుటేజ్) రికవరీ చేయడంపై దృష్టి పెట్టాయి.
ఇక్కడ ప్రధానంగా చర్చకి దారి తీస్తున్న విషయాలు చూస్తే ఈ నేరగాళ్ళు తాము సుద్ద పూసలమని నిందితుడైన సీఐ నాగరాజును కేవలం రాజమండ్రి జైలులోనే విచారించాలని, ఆ ప్రక్రియను పూర్తిగా వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించేలా హైకోర్టు తీర్పు వచ్చేలా చేసుకొనగా దీనివల్ల నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాల సేకరణ కష్టమవుతుందని సిట్ భావించి దీనిపై సిట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు హైకోర్టు నిబంధనలను సడలిస్తూ, సీఐ నాగరాజును 7 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.ఆ విచారణ జూలై చివరి వారంలో నాగరాజును రాజమండ్రి జైలు నుండి విజయవాడలోని సిట్ విచారణ కేంద్రానికి తరలించి, నేరం జరిగిన ప్రదేశాలకు తీసుకెళ్లి సుదీర్ఘంగా ప్రశ్నించగా అనేక సాక్ష్యాలు లభ్యమైనట్లు సిట్ అధికారుల ద్వారా స్పష్టం అవుతోంది.
అయితే ఈ కేసులో సీఐ నాగరాజుతో పాటు మరికొంతమంది పోలీసు సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తుల పాత్రను సిట్ గుర్తించి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు నాని, అశోక్ మరో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు, మరియు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చిన ఒక వైద్యుడిని సిట్ ఇప్పటికే అరెస్ట్ చేసింది.సీఐ నాగరాజుకు అత్యంత సన్నిహితుడు, ఆర్థిక లావాదేవీలు చూసే సురేశ్ ( కోసం సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేయగా, అతను సెప్టెంబర్ 17, 2026 న సిట్ అధికారుల ఎదుట లొంగిపోయాడు. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో, బాధితుడి కుటుంబంతో సెటిల్‌మెంట్ మాట్లాడటంలో ఇతనే కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది.ఇదిలా ఉండగా నగర పోలీస్ కమిషనర్ పర్యవేక్షణ లేకుండా కాలు కదపని టాస్క్ పోర్స్ అధికారులు కూడా గాదె సాయి కృష్ణ మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకువచ్చేందుకు సహకరించిన సంగతి తెలిసిందే.అయితే ఇంత మంది పాత్ర ఉన్నా సిట్ అధికారులు కొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.కానీ మొదటి నుంచి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి,ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని వారిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదన్న భిన్నమైన ప్రశ్నలు తలెత్తున్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తయితే నిందితుడు సి ఐ నాగరాజు అరెస్ట్ సందర్భంగా సింగ్ నగర్లో సానుభూతి పరులు ముసుగులో నాగరాజు అండగా నిలబడి నిరసన వ్యక్తం చేసి అక్కడ మీడియా కవరేజ్ ని నాగరాజు కు అనుకూలంగా మలుచుకునేందుకు అనేక రకాలుగా కష్ట పడ్డ అక్రమ రేషన్ రవాణా దారుడు,మద్యం బాటిళ్లతో మాయలు చేయాలని చూసిన వారి పై లోతైన విచారణ చేయాలని ప్రజల డిమాండ్ కూడా ఉంది. అక్రమ రేషన్ వ్యవహారం లో కోటా బియ్యం కొట్టేసి కోటి రూపాయల చిన్నోడిపై నగర కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయనే ఆరోపణలు లేకపోలేదు.ఆ రేషన్ మాఫియా తో కానిస్టేబుల్ అశోక్ సత్సంబంధాలు పెట్టుకుని సీఐ నాగరాజు కు వాటాలు ఇప్పిస్తూ కృష్ణలంక ఏరియా నుంచి ఆటోలు లారీలలో రేషన్ తరలింపు కు మార్గం సుగమం చేశారన్న ఆరోపణలు బోలెడు వచ్చినా ఆదిశగా సిట్ అధికారులు వారిపై కూడా నిఘా ఉంచారని తెలుస్తోంది. త్వరలో వారి భరతం పట్టేందుకు సిట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article