Saturday, May 3, 2025

Creating liberating content

సినిమా‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ వచ్చేసింది

‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ వచ్చేసింది

ఏపీ రాజధాని అమరావతి అంశంపై ‘రాజధాని ఫైల్స్’ చిత్రం రూపొందింది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది.ఆంధ్రప్రదేశ్ పేరును ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్లో మేకర్స్ నేరుగా ప్రస్తావించలేదు. అలాగే, రాజకీయ పార్టీల పేర్లను కూడా మార్చి చూపించారు. ఏపీకి మూడు రాజధానులను ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించగా.. ఇందులో నాలుగు రాజధానులు అంటూ మార్పు చేశారు. అయితే, ఇవి ఇలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపైనే ‘రాజధాని ఫైల్స్’ రూపొందిందని ట్రైలర్‌లో అర్థమైపోతోంది. అమరావతే రాజధానిగా ఉండాలని రైతులు చేస్తున్న పోరాటం, ఆవేదన, పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు భాను. ఈ చిత్రంలో కొన్ని పాత్రలు కూడా ప్రస్తుత రాజకీయ నాయకులను పోలినట్టు ఉన్నాయి. ఈ మూవీలో అఖిలన్, వీనా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే వారు తెరంగేట్రం చేస్తున్నారు.
రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చూపించే షాట్‍తో ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ మొదలైంది. “మన పంటకు నీరు ఎంత అవసరమో.. రాష్ట్రానికి రాజధాని అవసరం” అంటూ వినోద్ కుమార్ చెప్పే డైలాగ్ ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటూ ఎక్కువ రాజధానులను ప్రభుత్వం ప్రతిపాదించే సీన్ కూడా ఉంది. ఆ తర్వాత అమరావతే రాజధానిగా ఉండాలని రైతులు చేసే పోరాటాన్ని ట్రైలర్లో చూపించారు మేకర్స్.
“140 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఒక్క రాజధాని. ఆరు కోట్ల ప్రజలు ఉన్న రాష్ట్రానికి నాలుగు రాజధానులా. ఇది రాజ్యాంగబద్ధమా.. వ్యక్తిగత ద్వేషమా” అంటూ అసెంబ్లీలో అఖిలన్ డైలాగ్ చెబుతారు. అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర ఈ ట్రైలర్లో ఉంది. వారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేసిన చర్యలను కూడా మేకర్స్ చూపించారు. సమస్యకు పరిష్కారం దొరికే వరకు పోరాడుతూనే ఉంటామని రైతులు తెగేసి చెప్పడం.. “దేశానికే అన్నం పెట్టిన అన్నపూర్ణ అరుణప్రదేశ్.. భవతీ భిక్షాందేహీ అంటూ కనిపించిన అందరినీ అప్పుడు అడుక్కునే స్థాయికి దిగజారిపోయింది” అనే డైలాగ్‍తో రాజధాని ఫైల్స్ ట్రైలర్ ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article