కామవరపుకోట
స్థానిక కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో బి.ఎ, బి.కాం మరియు బి.ఎస్సీ కోర్సులలో ప్రవేశానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయబాబు ఒక ప్రకటనలో తెలిపారు . ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు కళాశాలకు విచ్చేసి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కళాశాలలో విద్యార్థుల సౌకర్యార్ధం ఆధునిక ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్, గ్రంధాలయం, రీడింగ్ రూమ్ లు, సెమినార్ హాల్, వర్చువల్ డిజిటల్ తరగతి గదులు, లేడీస్ వెయిటింగ్ హాల్, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, ఫీల్డ్ విజిట్ లు, స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్ ఎస్ ఎస్ విభాగం ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, మహిళా విద్యార్థుల కోసం ప్రత్యేక ఉమెన్ ఎంపవర్ మెంట్ విభాగం ఉందన్నారు. అలాగే కళాశాలలో ఉచిత వైఫై సదుపాయం కలదు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థినులకు ఉచిత హాస్టల్ సదుపాయం ప్రారంభించడం జరిగింది. కళాశాలలో క్రమశిక్షణ, విద్యార్థులపై వ్యక్తి గత శ్రద్ధ తీసుకుని విద్యా బోధన చేస్తున్నామని తెలిపారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్ షిప్ సదుపాయం కలదు. అంకితభావం గల అధ్యాపక బృందం ఉందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందిస్తున్న నాణ్యమైన ఉచిత విద్యను విద్యార్థులందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.