శుక్రవారం ఓటీటీల్లో తెలుగు సినిమాల సందడి
నెట్ ఫ్లిక్స్ లో ‘గుంటూరు కారం’
అమెజాన్ ప్రైమ్ లో ‘కెప్టెన్ మిల్లర్’
‘ఆహా’ లో ‘బబుల్ గమ్’
ఈ వారం ఓటీటీ సెంటర్లో సందడి కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ శుక్రవారం రోజున తెలుగు సినిమాల జోరు గట్టిగానే అనిపిస్తోంది. ఆ జాబితాలో ముందుగా ‘గుంటూరు కారం’ కనిపిస్తోంది.ఈ నెల 9వ తేదీ నుంచి ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది. ధనుశ్ హీరోగా రూపొందిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీ నుంచి ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.ఇక సుమ – రాజీవ్ కనకాల తనయుడు ‘బబుల్ గమ్’ సినిమాకి థియేటర్ల నుంచి అంతగా రెస్పాన్స్ రాలేదు. ఈ నెల 9వ తేదీ నుంచి, ‘ఆహా’ ఫ్లాట్ ఫామ్ పైకి రానుంది. ఇలా వేరువేరు ఫ్లాట్ ఫామ్లపై ఒకే రోజు 3 సినిమాలు సందడి చేయనున్నాయి.