తాజా వార్తలుఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ గారు కే శివప్రసాద్

ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ గారు కే శివప్రసాద్

ఏలేశ్వరం:-

గత కొంతకాలంగా ఇంచార్జ్ కమిషనర్ పాలనలో ఉన్న ఏలేశ్వరం నగర పంచాయతీకి నూతన కమిషనర్ గా కే శివప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖ జోనల్ కమిషనర్ గా పనిచేస్తూ బదిలీపై ఏలేశ్వరం వచ్చినట్లు ఆయన తెలిపారు. పట్టణంలో ఉన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. రానున్న వేసవికాలం దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రజలకు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా పాలకవర్గం సభ్యులతో, సిబ్బందితో కలిసి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం చైర్ పర్సన్ అలమండ సత్యవతి చలమయ్య ను మర్యాదపూర్వకంగా కలిశారు. సిబ్బంది ఆయనను అభినందించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article