సినిమాహీరో నానిని కలిసిన బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌

హీరో నానిని కలిసిన బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌

హీరో నానిని బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. గారెత్‌ హైదరాబాద్‌లో నాని నివాసానికి వెళ్లి ఆయన సమావేశమయ్యారు. ఈ విషయాన్ని గారెత్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా గారెత్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘హీరో నానిని కలవడం ఎంతో ఆనందం కలిగించింది. ఆయన సినీ, వ్యక్తిగత జీవితం గురించి అడిగి తెలుసుకున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమతో బ్రిటన్‌ సంబంధాలు ఏవిధంగా బలోపేతం చేసుకోవచ్చు అనే అంశంపైనా నానితో చర్చించాను. ఈ సందర్భంగా నాని తాను నటించిన రెండు సినిమాలు చూడమని నాకు సూచించారు. మరి నేచురల్‌ స్టార్‌ నటించిన ఏ సినిమాలు చూడాలో నాకు కాస్త చెబుతారా? అంటూ గారెత్‌ విన్‌ ఓవెన్‌ నెటిజన్లను కోరారు. ప్రస్తుతం గారెత్‌ నానితో కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article