తాజా వార్తలువైభవంగా శ్రీ దుర్గా మల్లేశ్వరుల దివ్య నగరోత్సవం.

వైభవంగా శ్రీ దుర్గా మల్లేశ్వరుల దివ్య నగరోత్సవం.

​శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం నుండి మంగళవాయిద్యాల నడుమ కనులపండువగా రథోత్సవం
​కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించిన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్.

​పురవీధులలో భక్తజన నీరాజనాలు – ఆధ్యాత్మిక శోభతో పులకించిన బెజవాడ నగరం

​ఇంద్రకీలాద్రి:
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో రెండవ రోజైన సోమవారం సాయంత్రం ఆదిదంపతులైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల పవిత్ర నగర రథోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.​ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ మల్లేశ్వర స్వామి వారి ప్రాంగణంలో ఉత్సవ మూర్తులకు ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి నగరోత్సవ రథయాత్రను ప్రారంభించి, స్వామి-అమ్మవార్ల పల్లకీ ముందుకు నడిపించారు.​మంగళవాయిద్యాల సందడి: సన్నాయి మేళాలు, కేరళ పంచవాయిద్యాలు, నాదస్వరాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఊరేగింపు అత్యంత కోలాహలంగా సాగింది.శ్రీ కనకదుర్గ నగర్, రధం సెంటర్, కెనాల్ రోడ్, దుర్గా ఘాట్,ఘాట్ రోడ్ మీదుగా కొండపైకి చేరారు.విద్యుద్దీపాలతో, పుష్పఅలంకరణలతో సర్వాంగసుందరంగా అలంకరించిన రథంపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వరులను దర్శించుకునేందుకు పురవీధుల్లో భక్తులు బారులు తీరారు.మార్గమధ్యంలో భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ, కొబ్బరికాయలు కొడుతూ స్వామి, అమ్మవార్లకు ఘనంగా నీరాజనాలు పలికారు.ఊరేగింపు సాగే మార్గంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా, భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయ భద్రతా సిబ్బంది, విజయవాడ నగర పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.​ఈ నగరోత్సవ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, స్థానాచార్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article