వికారాబాద్ రైల్వేస్టేషన్ లో రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడు అదుపుతప్పి ట్రైన్, ప్లాట్ ఫామ్ మధ్యలో పడిపోయాడు. ప్రయాణికుడిని గమనించిన రైల్వే సిబ్బంది ట్రైన్ ను నిలిపివేశారు. దాదాపు రెండు గంటలు పాటు ప్రయాణికుడు ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుని నరకయాతన అనుభవించాడు. రైల్వే పోలీసులు ప్లాట్‌ఫామ్ పగులగొట్టి ఇరుక్కున్న ప్రయాణికుడిని రక్షించారు. ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి రాయచూర్‌కు చెందిన సతీష్ గా రైల్వే పోలీసులు గుర్తించారు. ప్రయాణికుడు ప్లాట్ ఫామ్ మధ్యలో ఇరుక్కున్న ఘటన అక్కడి కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటనతో రైలు గంటల పాటు నిలిచిపోయింది. కదులుతున్న రైలు ఎక్కడం, దిగడం ప్రమాదకరమని ఈ ఘటనతో మరోసారి రుజువైంది.

