Sunday, February 15, 2026

Creating liberating content

Uncategorizedయుఎస్ఓ వారు నిర్వహించిన పోటీలలో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

యుఎస్ఓ వారు నిర్వహించిన పోటీలలో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

వేంపల్లె
జనవరి 30వ తారీఖున పులివెందుల లయోల డిగ్రీ కళాశాల యందు యునైటెడ్ స్కూల్స్ ఆర్గ నైజేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన ఇంటర్ స్కూల్ ఫెస్ట్-2024 కార్యక్రమం లో ఐదు రకాల పోటీలలో డ్యాన్స్, మరియు స్పాట్ పెయింటింగ్ నందు వేంపల్లి శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థులు మొదటి బహుమతిని సాధించారు. ఈ పోటీలలో వివిధ జిల్లాల నుండి అనేక పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. తమ పాఠశాల విద్యార్థులు డ్యాన్స్ లో వై.హేమెంద్రి, పి.మిధున ప్రియ, కె.జస్విత ప్రియ, ఆర్.హర్షిని, పి.షణ్ముఖ ప్రియ అను విద్యార్థినిలు మరియు స్పాట్ పెయింటింగ్ నందు టీ.రోహిత్ అను విద్యార్థి ప్రథమ బహుమతిని సాధించడం పట్ల పాఠశాల కరస్పాండెంట్ బి. చక్రపాణి రెడ్డి విద్యార్థులను శిక్షణ ఇచ్చిన డాన్స్ మాస్టర్ ను, డ్రాయింగ్ మాస్టర్ ను అభినందించి హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article