*మేడ కట్టుకోవాలంటే మెడలు వంచాల్సిందేనట…
*అంతస్తు ..అంతస్తుకు అక్షరాల లచ్ఛలు ఇవ్వాల్సిందే నట.. .







- వీరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ లేనా…లేక…?
- కప్పం కట్టాల్సింది కార్పొరేషన్ కా…కాగితాలు చూసే వారికా…
- వీరి కొంపలకోసం ఇంకెన్ని కొంపలు కట్టిస్తారో…
- వీరి అక్రమాల కోసం ఎన్ని అక్రమాలైనా చేస్తారా..
- వీరుండేది అక్రమాలు సక్రమాలు చేయడానికా… మరిన్ని అక్రమాలు చేయడానికా…
- వీరి అక్రమాలకు అండ దండ సిటీ ప్లానర్ ఉన్నాడా…
- ప్రతి కట్టడం వెనుక కమిషనర్ కు కూడాను…?
- ఇదేనా కూటమి ప్రభుత్వ విధానం…
- పశ్చిమ లోనే ఎందుకింత అరాచకం…
- సుజనా చౌదరి చూడడం లేదని చులకనగా ఉన్నారా…
- కూటమి లోనే ఇంత అవినీతి జరుగుతుంటే…
- కార్పొరేషన్ పూర్తిగా అవినీతి కంపు లో కూరుకు పోతుందా…
- ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసే వారేలేరా…?
(రామమోహన్ రెడ్డి)
“నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి
యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్ఠం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ
నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం”
అని సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎందుకు రాసాడో గాని నిజంగా స్వతంత్ర భారతావనిలో ఇంకనూ పరాయి పాలకుల కంటే హీనంగా నేటి అధికార యంత్రాంగం దోచుకు తినడానికి సిద్ధపడుతూనే ఉన్నారంటే ఎవరిని అడగాలి.. ఎవరిని నిగ్గదీసి కడగాలన్న ఆలోచన మొదలవుతుంది.
ప్రజలు తమ రక్త మాంసాలను కరిగించి పన్నుల రూపంలో చెల్లిస్తున్న రూపాయిలను జీతాలు తీసుకుంటూ తమ సిరా చుక్క కోసం రక్తపు చుక్కలను సైతం వదలని విదంగా అనుమతులు అన్న అక్షరానికి అక్షరాల లక్షలు కావాలని అడగడం ఇవ్వకపోతే అడ్డంకులు సృష్టించడం ఇస్తే ఏ ఆటంకాలు లేకుండా అక్రమ నిర్మాణాలు చేసుకునేలా దగ్గరుండి అనుమతులు మంజూరు చేసి అతిపెద్ద నీతి మాలిన మాటలు మాట్లాడుతూ మాయలో ముంచడం ఈ మున్సిపల్ అధికారులకే చెల్లుతుందని చెప్పక తప్పడం లేదు.
రాష్ట్రంలో పేరు గాంచిన అతి పెద్ద కార్పొరేషన్ లో రెండవది ఆయిన బెజవాడ కార్పొరేషన్ లోని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపూ లేకుండా పోతుందని పత్రికలు ఘోషిస్తున్న పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విమర్శలు వచ్చిపడుతున్నాయి.
గత పాలకులు ఈ రాష్టాన్ని అవినీతి మయం చేసారని ఆందోళన చేసిన నాయకులే కొందరు కార్పొరేషన్ కు గండి కొట్టి కొత్త కొంప కట్టుకునే వారి కొంపలు కొల్లగొట్టి తమ కొంపలు బాగుచేసుకుంటుంటే అడిగే నాధుడు కరువయ్యారు. గత ప్రబుత్వ హయాంలో టిపిఓ గా ఉన్న గంధం ప్రసాద్ అవినీతి,అక్రమ సంపాదనకు నిలయంగా మారిన పశ్చిమ నియోజకవర్గ లోని బిల్డింగ్ ఇన్స్పెక్టర్ లు నాటి కంటే ఎక్కువగా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ తమ సంచులు నింపుకుంటుంటే ఆ అవినీతి అధికారులపై చర్యలు తీసుకునే వారు లేరా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇందుకు నిదర్శనంగా వన్ టౌన్,43 డివిజన్ ,40 డివిజన్,భారతీనగర్ హరినారాయ వీధి,46 డివిజన్ రాజివ్ శర్మ నగర్ ,53 డివిజన్ పాపయ్య నాయుడు వీధి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తే పెద్ది ప్రసాదం ఎంత ముట్టింది,మురళీ గానం ఎంత బాగా వినపడిందో అట్లే అర్ధమవుతుంది. ఆయితే ఈ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ల అవినీతి పై ఉన్నతాధికారులకు పిర్యాదు చేయడం కోసం స్పందన ,కార్పొరేషన్ పిర్యాదు విభాగంలో ఇచ్చిన కూడా అక్కడ ఉండే సిబ్బంది నే కాదు ఆఖరికి కమిషనర్ కు కూడా కాసులివ్వనిదే ప్లాన్ ఇవ్వడం కుదరదని చెప్పుకొస్తుండటం తో నిర్మాణ దారుల్లో కొంతమంది అడిగినంత ఇచ్చుకో వడం జరుగుతుండగా బ్రోకర్ లు ,అక్రమ నిర్మాణ దారులు అడ్డగోలు వ్యవహారం చేసుకోవడం అనుకున్న అంతస్తులు హాయిగా అనుమతులు అరకొర ఉన్నట్లు చూపించడం నిర్మాణం చేపట్టడం పరిపాటిగా మరిపోతూనే ఉంది.ఇక ఆయా కార్పోరేటర్ ల సంగతి చెప్పనక్కర్లేదు. అందిన కాడికి మొదట వారే దోచుకోవడం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ కండువా కప్పుకుని తమ కక్కుర్తి పనులు చేసుకోవడం మళ్ళీ కార్పొరేషన్ మీటింగ్ లలో కహానీ మాటలు మాట్లాడి అబ్బా అనిపించుకోవడానికి ప్రయత్నం చేయడం అలవాటుపడిన సందర్భంలో ఈ అక్రమ కట్టడాలకు కళ్లెం వేసేదేవరు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ ఏరియా ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే ఈ అధికారుల తీరుపై ఆలోచన చేసే తీరిక లేదన్న విధానం ఒకటి కూటమి లో ఉన్న ఏదో ఒక పార్టీని ఆశ్రయించిన ఈ అక్రమ నిర్మాణ దారులు అంతా మనవారే అని అనుకోవడం అమ్యామ్యా చేసుకోవడం అంతా మామూలే అన్న ధోరణి ఏర్పడినట్లు తెలియ వస్తుంది.దీనితోఈ నీతి లేని అధికారులు కూడా నాకింత నీకింత అని అనుకుంటూ అప్పనంగా దోచుకుంటున్న ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ కార్పొరేషన్ లో ఉన్న అవీనీతి కంపు కడిగేవారెవరో అన్న ఆలోచన లో కార్పొరేషన్ ప్రజలు ఉన్నారు.


Pk365game e uma otima opção para quem busca jogos variados e com boa jogabilidade. Gostei bastante da facilidade de encontrar os jogos que procuro. Recomendo! pk365game
W500casinologin is legit! Easy to navigate and always a good time. Sign up! You won’t regret it. Start winning today with w500casinologin.
123betwin is my go-to when I’m looking to place some bets. Good odds and a user-friendly interface what else do you need? Bet and win with 123betwin.