ముదిగుబ్బ
ముదిగుబ్బ మండల కేంద్రంలో తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్ జన్మదిన వేడుకలను ఆపార్టీ నాయకులు కార్యకర్తలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ కూడలినందు పట్టణ అధ్యక్షులు తుమ్మల మనోహర్ ఆధ్వర్యంలో జన్మదిన కేకునుకోసి సంబరాలు చేసుకున్నారు. ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ ప్రభాకర్, రమేష్ బాబు, మహబూబ్ పీరా, రియాజ్, వినోద్, రాగిగోపాల్, సుబ్బరాయుడు, వెంకటకిష్ట, పుల్లప్ప, అశోక్ తదితరులు పాల్గొన్నారు.