టాప్ న్యూస్పశ్చాత్తాపములో కూడా పరిహాసమా...!

పశ్చాత్తాపములో కూడా పరిహాసమా…!

*ఏమిటమ్మ ఎమ్మెల్యే మిరియాల శిరీషా గారు…
*నోరు పారేసుకున్నారు అది నిజమే…
*మళ్ళీ తప్పు అనుకుని క్షమాపణలు చెప్పారు ఓకే…
*ఇందులో వైసీపీ కుట్ర ఎక్కడ ఉంది…
*ఒక సోషియల్ మీడియాలోనే కాదు…అన్ని మీడియాలలో కోడై కూస్తుంది…
*మీ తిట్ల దండకం లోకమంతా తిరుగుతూనే ఉంది…
*మీరు ఎమ్మెల్యే అన్న స్పృహ ఆ క్షణం కోల్పోయారు…
*అదే మీకు పెద్ద మైనస్ అయ్యింది…అవుతూ ఉంది…
*అడ్డతీగల ఎవరి అడ్డా అయినా…మన అడ్డా అనుకోవాలిగా..
*అనంతబాబు వర్గమూ ఉంటుంది…
*అతనేమీ సామాన్యుడు కాదుగా…
*శవాన్నే డోర్ డెలివరీ చేసిన వాడు…
*మరి రాజకీయ పాఠశాలలో చదువులు వేరే ఉంటాయిగా శిరీషా దేవి గారు…
*లోపం మొత్తం మన మఠం లోనే ఉందటగా…
*మన మఠమే మన కొంపముంచుతున్నాడటగా
*మారండి మిరియాల శిరీషా దేవి గారు…
*ఈ మార్పు మంచిదేనా…
(రామమోహన్ రెడ్డి)
పశ్చాతాపంకు మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు.మనం చేసిన తప్పును తెలుసుకుని, మనస్ఫూర్తిగా బాధపడటమే (పశ్చాతాపం) అన్నిటికంటే పెద్ద శిక్ష మరియు శ్రేష్ఠమైన ప్రాయశ్చిత్తం.
మనుషులుగా మనం తెలియకో, తెలిసో కొన్ని తప్పులు చేయడం సహజం. అయితే, ఆ తప్పును దాచాలని చూడకుండా, మనస్ఫూర్తిగా మన తప్పును మనం తెలుసుకోవడమే పశ్చాతాపం
అయితే ఈ ప్రస్తావన ఇక్కడ ఎందుకయ్యా అంటే గత నాలుగు రోజులుగా సామాజిక మాధ్యమాలు,ప్రధాన మీడియాలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి తన సొంత పార్టీ నేతలపై అడ్డతీగల మండలంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అవన్నీ పార్టీ హైకమాండ్ దృష్టికి పోవడం తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ గా నడిచి ప్రతిపక్ష పార్టీ కి తమకు తామే ఒక ఆయుధాన్ని అందించనంత పని అయ్యింది.
“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్తు అకర్మణి”
కర్మలోనే అధికారం: మన కర్తవ్యాన్ని, బాధ్యతను శ్రద్ధగా నిర్వర్తించడం మాత్రమే మన చేతిలో ఉంటుంది.ఫలితం మీద నియంత్రణ లేదు: ఆ పని వల్ల వచ్చే ఫలితం మన అజంషీలో ఉండదు, కాబట్టి ఫలితాన్ని ఆశించి పని చేయకూడదని గీతలో చెప్పబడింది. సరిగ్గా ఇక్కడ కూడా ఎమ్మెల్యే ఆ గీతను అనుసరించి ఉంటే పలితం అనేది దానంతట అదే వచ్చేది.కానీ ఆమె ,ఆమె భార్య భర్త మఠం విజయ్ భాస్కర్ వ్యవహారం సొంత పార్టీ లోనే కింది స్థాయి కార్యకర్తలకు ఇబ్బందిగా మారడంతో పార్టీ పెద్దల దృష్టికి తీసుక వెళ్ళడం జరిగింది.అది జీర్ణించుకోలేని ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది.అయితే జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం లో బాగంగా మీడియా వేదికగా తాను క్షమాపణలు కోరడం ఉత్తమ సంస్కారం.అయితే తాను చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీ వక్రీకరించి కొన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయించారని అనడంలోనే ఆమె వ్యవహార శైలి పై సొంత పార్టీలోనే అంతర్గత చర్చలు నడుస్తూ ఉన్నాయి.ఆమె అన్నది నిజం…తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పడం వరకు పర్వాలేదు కానీ అడ్డతీగల మండలంలో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబు,మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి వర్గీయులు ద్వారా కొన్ని వర్గాలుగా విడిపోయి ఉన్నాయనేది రాజకీయ పరమైన అంశం.దానికి టీడీపీ కార్యకర్తలకు ముడిపెట్టడం అనేది ఇక్కడ ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంది. భవిష్యత్ లో పోలవరం జిల్లా రెండు నియోజక వర్గాలుగా విభజన జరిగితే ఇంకో నియోజక వర్గంలో కూడా వెనుకబడిన తరగతి వర్గానికే సీటు కేటాయింపు అనేది ఖాయం.అయితే ప్రస్తుత ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి తీరు వలన టీడీపీ అధిష్టానం కూడా ఇంకో సీటు కేటాయింపు లో ఆలోచన ధోరణి లో మార్పు రావడం సహజం అన్న వాదన వినిపిస్తోంది.
అదియును కాక ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి భర్త మఠం విజయ్ భాస్కర్ అక్కడి వైసీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి కొన్ని రకాల్ వ్యాపార లావాదేవీలు , కాంట్రాక్టు పనులు,ఇతర విషయాలలో కలిసి మెలిసి చేస్తున్నట్లు కూడా అక్కడ ప్రచారం జోరుగా సాగుతోంది.ఈ నేపధ్యంలో వైసీపీ కి చెందిన వారి జాబితా పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుక వెళ్ళడం జరిగినట్లు కింది స్థాయి కార్యకర్తలు చెప్పుక వస్తున్నారు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం జైలులో ఉండటం మూలం వైసీపీ క్యాడర్ లో కొంత నిరుత్సాహం ఉందనేది అక్కడి ప్రజల ద్వారా తెలుస్తోంది. అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యం ను హత్యచేసి డోర్ డెలివరీ కేసులో లోపల ఉన్నా ఆయన క్యాడర్ గురించి కంగారు పడే ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి నిజంగా అనంతబాబు శవాన్ని డోర్ డెలివరీ చేయకుండా ఉండి ఉంటే పోలవరం జిల్లాలో రాజకీయ పరమైన విషయాలలో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదన్నది యదార్థం.ఇవన్నీ తెలిసి కూడా కూటమి ప్రభుత్వంకు సొంత పార్టీలో వేరు కుంపట్లు,కూటమిలో భాగస్వామ్య పక్షం నుంచి అంతర్గత విభేదాలు లోలోపల ఉన్నాయనేది జగమెరిగిన సత్యం.ఎప్పుడు అంతర్గత విభేదాలు బగ్గుమంటాయో తెలియని వైచిత్రి ఉన్న ఈ తరుణంలో మొదటి సారీ ఎమ్మెల్యే అయిన మిరియాల శిరీషా దేవి తన రాజకీయ భవిష్యత్ కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉండగా ఇలా తమకు తానే ఇలా నోరు పారేసుకోవడం సరైన పద్దతి కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.అయితే ఇప్పుడు ఆమె తన వ్యాఖ్యల పట్ల దిద్దుబాటు చర్యలు చేపట్టినది మంచి శుభపరిణామం అయినా భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనేది స్థానిక సమరం తర్వాత పలితం వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయని మేధావి వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article