*అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి
*నేటి సంఘటన కొత్తేమి కాదు…
*గతంలో మహబూబ్ నగర్,మొన్న గార్లదిన్నె దారిలో బస్సు దగ్ధం..
*రోడ్డు ప్రమాదాలు అనేకం..
*సంఘటన జరిగినప్పుడే సొల్లు మాటలు
*రోజులు గడిస్తే అంతా సక్రమే…
*రవాణా శాఖ అధికారుల తీరే వేరు…
*వారి అవినీతి కి అడ్డుకట్ట వేసే వారు లేక పోవడమే ..
*రోడ్డు భద్రత పై రక్షణ చర్యలు ఎక్కడో…
*ప్రకటనలకే పరిమితమవుతున్న ప్రభుత్వ ఆదేశాలు…
*ప్రజల ప్రాణాలు మాత్రం పై లోకాలకే…
*మితిమీరిన వేగం…బస్సుల్లో కొరవడిన భద్రత ప్రమాణాలు..
*ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటారో మరి..
*ప్రజల్లో కూడ మార్పు రావాల్సిందే…
*గమ్యం కోసం గత తప్పుతుంటే…
*ప్రవేటు ప్రయాణం పై లోకాలకు పయనమే…
*ఈ ప్రభుత్వ అధికారుల తీరు మారేదెన్నడు… ఈ ప్రజల ప్రాణాలు నిలబడేదెన్నడూ…
*మారదు ఈ లోకం…మరణం తప్పదు మనుష్యులకు
(రామమోహన్ రెడ్డి)

“నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం”అని సిరివెన్నెల సీతారాముశాస్త్రి ఆనాడే చెప్పాడు.

ఈ దేశం,ఈ రాష్ట్రంలో ఉన్న అవినీతి అధికారులు, డబ్బే పరమాధిగా భావించి ముందుకు వెళ్తున్న తరుణంలో సగటు మనిషి బ్రతుకు ను ఛిద్రం చేస్తున్నామనే కనీస విజ్ఞత లేని సమాజంలో ఉన్నప్పుడు ప్రజల ప్రాణాలకు రక్షణ గ్యారెంటీ గా లేదని చెప్పాలి. కొంతమంది మనిషుల స్వార్థం ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్న తరుణంలో కనీస బాద్యత గా ఉండాల్సిన అధికారులు తమ ఉద్యోగ ధర్మాన్ని విస్మరించడం వల్లే నేడు ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలు మంటల్లో కాలిబూడిద అయి పోతున్నాయి.గొంతులో ప్రాణం ఉండగానే సజీవంగా తగలబడి పోయి కనీసం వారి శరీరాలు కూడా గుర్తుపట్టలేని స్థితి కి చేరుకున్న దౌర్భాగ్య ఘటన చూస్తుంటే ఈ సమాజం నివ్వెర పోతుంది.ఆ హృదయవిదారకర ఘటన తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పాటు చెందుతుంది.ఇదంతా కూడ నిర్లక్ష్యం.. నిర్లక్ష్యం.. నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం ఏ ఒక్కరిదో కాదు.ఈ ప్రజలను పాలిస్తున్నా మని చెప్పుకునే ప్రభుత్వం లో ఉన్న ప్రతి ఒక్కరిది. పాలించే ప్రభువు ఒక్కడు మంచి వాడు అయినంత మాత్రానా ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నది ఈ భూమి మీద శుద్ధ అబద్ధం. ప్రభుత్వం లో ఉన్న ప్రతి వ్యక్తి తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించి నప్పుడే ప్రజల సుఖ సంతోషాలతో ఉంటారనేది జగమెరిగిన సత్యం. కానీ ఇక్కడ అలా జరగడం లేదే. దేశం నుంచి రాష్ట్రం.. రాష్ట్రం నుంచి గ్రామాల వరకు ప్రజల రక్త మాంసం తో కడుతున్న పన్నులు రూపంలో జీతాలు తీసుకుని ప్రజా సంక్షేమ ము కోసం పని చేయడానికి అధికార వ్యవస్థలు వెలగ బెడుతున్నారుగా. జరుగుతున్న ఘోరమైన దుర్ఘటనలలో ఏ ఒక్కరికీ మినహాయింపు ఉండదుగా.ప్రతి వ్యవస్థ ను గాడిలో పెట్టేందుకు గ్రామ స్తాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నో విభాగాలు గా పరిపాలన చేస్తున్నప్పుడు ఆ పరిపాలన లో ఉన్న లోపాలు స్పష్టంగా తెలిసి కూడా ఎందుకు ఆ లోపాలను సరి చేయలేక పోతున్నారన్నదే అసలు ప్రశ్న. అందుకు సమాధానం దొరకని పరిస్థితి. కారణం స్వతంత్ర భారతావని లో రాజ్యాంగం ఇచ్చిన అపార మైన స్వేచ్ఛ. ఆ స్వేచ్చను ఆసరాగా తీసుకుని దనార్జనే ద్యేయంగా ఏ రాజకీయ పార్టీ అదికారంలో ఉంటే ఆ పార్టీ పేరు ఒక వైపు, మరో వైపు కుల జాడ్యం, మరో వైపు ఆర్థిక స్థిరత్వం ఇవేమీ కాదంటే లంచాలు ఎరగా వేసి లుచ్చాపనుల చేస్తూ లాలూచి పడితే చివరికి బ్రతికుండగానే చితికి చేరే పరిస్థితి దాపురిస్తుంది. మనిషి బ్రతికుండగా కట్టడి చేయలేని అసమర్థ ప్రభుత్వము,ఆ ప్రభుత్వం లో ఉన్న పెద్ద పెద్ద నేతలు,ఆ నేతల మోకాళ్ళ దగ్గర తమ ఉద్యోగ ధర్మాన్ని మోకరిల్లచేసి ముష్టి కోసం అర్రులు చాచే అవినీతి అధికారుల అలసత్వం ప్రదర్శిస్తున్న కాలం ప్రజలు బ్రతికుండగానే దహించి పోతారన్నాది సత్యం. ఇది ఎవరు కాదన్న ఆవునన్న అది జీవిత పరమార్థం.జీతాల పెంపు,అలవెన్స్ కోసం అనేక ఉద్యమాలు చేస్తూ ఉప నిసత్తులు చేసే ఉత్తమొత్తములు తమ ఉన్నతమైన ఉద్యోగ ధర్మాన్ని విస్మరించడం వల్లనే ఇలా ప్రజలు విగత జీవులు గా మిగిలి పోవాల్సి వస్తోంది .


ఇలా ఎందుకు అనాల్సి వస్తోంది అంటే అందుకు సవా లక్ష కారణాలు లేక పోలేదు. ప్రవేటు బస్ చూడడానికి అందంగా చక్కగా అలంకరించుకుని ఉంటుంది. ఆ అలంకరణ వెనుక ఉన్న అనేక మతలబులు అమాయక ప్రయాణికులకు తెలియదు కాబోలు. అవినీతి అధికారుల అలసత్వం కారణంగా మేడి పండు చూడ మేలిమైనుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న చందంగా అనుమతులు కానీ ఆ బస్ సామర్థ్యం అంతా లోపభూయిష్టంగా ఉంటుందనేది అక్షర సత్యం. అసలు ఒక బస్ కెపాసిటీ ఎంత ,ప్రయాణ సమయం ఎంత వేగపరిమితి ఎంత డ్రైవర్లు ఎందరు అన్నది అంతా మాయే.పైగా లగేజి బస్ పైన కింద కాళీ లేకుండా నింపడం ఇలా ఒకటి కాదు అనేకం లోపాలు ఉంటాయి.ఇవన్ని ప్రయాణిస్తున్న ప్రయాణికుడి కి తెలియవు. తెలుసుకోవడానికి వీలు ఉండదు. సగటు ప్రయాణికులు టికెట్ తీసుకున్నామా సౌకర్యాలు ఉన్నాయా చూసుకుని కొంత ఇబ్బంది ఉన్నా తప్పని పరిస్థితుల్లో ప్రయాణాన్ని సాగిస్తారు. కానీ లోపభూయిష్టంగా ప్రయాణికుల జీవితాల తో చెలగాటం ఆడకుండా చూడాల్సిన రవాణా శాఖ ఎక్కడ ఉంది అంటే రూపాయిలు లెక్క పెట్టుకోవడం లో క్షణం తీరిక లేకుండా ఉందనే విమర్శల పాలవుతోంది.ఇందులో కొంత వాస్తవం లేక పోలేదు.ఇలా ఒక వ్యవస్థ నిర్లక్ష్యం కారణంగా నిద్రమత్తులో ఉన్న నిండు ప్రాణాలు నిలువున కాలి బూడిద అవుతున్నాయి. ఈ పాపం కేవలము రవాణా శాఖ అధికారులే అన్న బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు ప్రజల ప్రాణాలు పోయాక ప్రగాఢ సానుభూతి ప్రకటించే ప్రభుత్వ పెద్దలు,ప్రకటించే ఎక్సగ్రేసియా తో పాటు ప్రజల ప్రాణాలు పోవడానికి కారకులైన వారికి కంటి మీద కునుకు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు బాదాతప్త హృదయం తో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

