30 ఇయర్స్ ఇండస్ట్రీ, నటుడు పృధ్వీ రాజ్, ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లు జనసేన పార్టీలో చేరారు.. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఇద్దరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జనసేనాని పవన్ కల్యాణ్.గతంలో వైసిపిలో ఉన్న పృధ్వీ ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు..తాజాగా ఆయన జనసేన తీర్ధం తీసుకున్నారు.. ఇక ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.