జగన్ విధ్వంస కారుడేనని సమర్దించింది ఆయన మానస పుత్రులే…
*విధ్వంసం పుస్తకం తో బట్టబయలు …
*జగన్మోహనుడా నీ జగతి పబ్లికేషన్స్ ద్రోహం తలపెట్టిందా…!

ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడన్న చందాన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరాజయానికి ఆయన మానస పుత్రిక జగతి పబ్లికేషన్స్ సాక్షి పత్రిక, సాక్షి మీడియా నే కారణమా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.మరి ఇలా ఎందుకు జరిగిందో వైయస్ జగన్ ఓ సారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయాలను ఆలస్యంగా నైన వైసీపీ అభిమానులు, సానుభూతి పరులు వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎందుకు అనాల్సి వస్తుందని అంటే ప్రస్తుత శ్రీరాఘవాచారి ప్రెస్ అకాడమి చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉండి పరిపాలన చేసిన తీరుపై విధ్వంసం పుస్తక రచనలో “నమోవాకాలు” అనే పేజిలో క్లుప్తంగా వివరాలు ఇవ్వడం జరిగింది.ఆ పేజిలో రచయిత”2019 ప్రారంభం నుంచి 2023 ఆఖరు వరకు ఆంద్రప్రదేశ్ లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల పై ఒక డాక్యుమెంట్ లాంటి ఈ రచన కోసం నేను ఆచరిత్ర చిత్తు ప్రతుల పైనే ఆదారపడ్డాను.మొదటి నుంచి చివరి వరకు ప్రాథమిక సమాచారానికి మూలం దినపత్రిక లే కాబట్టి నా రాతలకు ఆధారాలు మళ్లీ ప్రత్యేకంగా ఇవ్వడం అవసరం అని భావించాను. ఈ ప్రయత్నానికి చాలా మంది .మిత్రులు చాలా విలువైన సహకారం అందించారు.ఆ చాలామంది లో చాలా మంది నా లాంటి జర్నలిస్ట్ లే. సాక్షితో సహా వివిధ పత్రిక లలో పని పనిచేసిన ,చేస్తున్న జర్నలిస్ట్ లను చాలామందిని చాలా సార్లు వేదించాను.ఎవరు విసుక్కోలేదు. ఓపిగ్గా నా యక్ష ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.వారందరికి,మీడియా వెలువలి మిత్రులకు నేను ఎంతయినా రుణపడి ఉంటాను.ఆ రుణం విలువ లెక్కకు అందేది కాదు .వారందరికి నా నమో వాకాలు”అని రచయిత పేర్కొన్నారు. దీనిని బట్టి వైఎస్ జగన్ తన పాలన ఎంత విధ్వంసకరంగా చేశారో అర్థం చేసుకోవాలా అపార్థం చేసుకోవాలా అన్నది ఆయనకే తెలియాలి.గతంలో మాజీ మంత్రి పెర్నీ నాని కూడా తమ ముఖ్యమంత్రి సీఎంవో నడపడం లో విఫలమైందని చెప్పడం జరిగింది. అయితే ఓటమి చెందిన తరువాత వైఫల్యాలను పునః సమీక్ష చేసుకోవడం మంచిదే.సాక్షి మీడియా మొత్తం వైసీపీ పార్టీ కోసమే అన్నది జగమెరిగిన సత్యం. అలాంటి సంస్థలో పని చేసిన,పని చేస్తున్న వారు కావచ్చు మొత్తానికి జగన్ విధ్వంసం సాక్షి కుటుంబ సభ్యులు కూడా భరించలేక పోయారేమో నన్న విమర్శకు దారితీస్తుంది జగన్ తీరు. లేదా ఐజేయు, ఏపీయూ డబ్ల్యూ జే యూనియన్ భావజాలం సాక్షిలో పని చేసిన పని చేస్తున్న వారి నర నరాల్లో పొంగిపొర్లు తున్నాయని చెప్పాలో అర్థం కానీ పరిస్థితి. ఎందుకంటే ఆ యూనియన్ మెజారిటీ సఫార్ట్ చంద్రబాబు కు ఉంటుందని చెప్పడం లో వింతేమి కాదు.ఎందుకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా లేకున్నా మీడియా అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే మీడియా అనే భావన ఉంది కాబట్టి.ఆ భావన వైసీపీ పార్టీ కి గాని, ఆ పార్టీ నేతల్లో చాలామంది కి లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఏది ఏమైనా జగన్ పాలన విధ్వంసం అని నిరూపించడానికి ఆయన మీడియా కూడా కీలక పాత్ర పోషించందన్నది విధ్వంసం పుస్తకం ద్వారా తెలుసుకోవడం కూడా మంచిదే.

