తాజా వార్తలుఇర్రిపాకలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు పూజలు నిర్వహించిన జ్యోతుల నెహ్రూ కుటుంబం

ఇర్రిపాకలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు పూజలు నిర్వహించిన జ్యోతుల నెహ్రూ కుటుంబం

జగ్గంపేట

జగ్గంపేట మండలం ఇర్రిపాక శివాలయం వద్ద జ్యోతుల నెహ్రూ, జ్యోతుల మణి కుటుంబం అత్యంత వైభవంగా భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ట మహోత్సవం నిన్నటి రోజు అంకరార్పణ చేశారు. సోమవారం 10 గంటలకు మండప పూజ ప్రారంభించి, గోపూజ, క్షీరాదివాసం మొదలగు పూజలు నిర్వహించారు. 13వ తేదీ కూడా అదివాసాలు నిర్వహించి 14వ తేదీ ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ట జరుగుతుందని జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమాలకు భక్తులందరూ హాజరై ఆ శివుడి కృపకు పాత్రులవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు టిడిపి ఇన్చార్జ్ వరుపుల సత్య ప్రభ, అడబాల భాస్కరరావు, జ్యోతుల లక్ష్మీదేవి, జ్యోతుల అనీష్ నెహ్రూ, సుంకవిల్లి రాజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article