సినిమా‘ఆ ఒక్కటీ అడక్కు’ టీజర్‌ లాంచ్‌

‘ఆ ఒక్కటీ అడక్కు’ టీజర్‌ లాంచ్‌

హీరో అల్లరి నరేష్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక నిర్మిస్తున్నారు. భరత్‌ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది.టైటిల్‌ గ్లింప్స్‌ సినిమా అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని హామీ ఇవ్వగా, మొదటి సింగిల్‌ ఓ మేడమ్‌ కూడా మంచి ఆదరణ పొందింది. మంగళవారం మేకర్స్‌ సినిమా టీజర్‌ను లాంచ్‌ చేశారు. ప్లాట్‌లైన్‌ చాలా ఆసక్తికరంగా ఉంది, పాన్‌ ఇండియా లాంటి సమస్య పెళ్లిని ఎంచుకున్న మల్లి అంకం దీనిని వినోదాత్మకంగా రూపొందించాడు. అల్లరి నరేష్‌ తన అల్లరితో మళ్ళీ అలరించారు. తన కామిక్‌ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. నరేష్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ గా ఫరియా అబ్దుల్లా కూల్‌ గా కనిపించారు. వెన్నెల కిషోర్‌, వైవా హర్ష మొదలైన హాస్యనటులు మరింత వినోదాన్ని పంచారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article