సినిమాఅవకాశాల కోసం మరీ ఇంతగా దిగజారాలా..?

అవకాశాల కోసం మరీ ఇంతగా దిగజారాలా..?

అవకాశాల కోసమో.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ కోసమో గ్లామరస్‌ ఫోటోలను పోస్ట్‌ చేయడానికి హద్దులు చెరిపేస్తున్నారు. చివరికి బికినీల్లోనూ కనిపించడానికి కూడా ఆలోచించడం లేదు.తాజాగా నటి సంయుక్త హెగ్డే పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. ఈ శాండిల్‌ వుడ్‌ బ్యూటీ ఆ మధ్య బిగ్‌ బాస్‌ రియాల్టీ గేమ్‌ షోలో పాల్గొని హల్‌ చల్‌ చేసింది. కన్నడ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో కనువిందు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. గతంలో నటించిన చిత్రాలు చాలావరకు సక్సెస్‌ అయిన సంయుక్తకు మాత్రం పెద్దగా కలిసిరాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక్క కూడా లేకపోవడంతో గ్లామర్‌ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.సోషల్‌ మీడియా వేదికగా గ్లామరస్‌ ఫొటోలను ఇన్‌ స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే పనిలో పడింది. తాజాగా మరో అడుగుముందుకేసి ఏకంగా స్విమ్మింగ్ డ్రెస్‌లో ప్రత్యక్షమైంది. సముద్రంలో నీళ్లపై తేలియాడుతూ స్విమ్‌ చేస్తున్న ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘సముద్రం చాలా లోతైనది, ప్రమాదకరమైనది. ఐతే ప్రతి ఒక్కరూ దానిలో మునిగిపోలేరు. కానీ అలా మునిగిపోని వారు సరికొత్త ప్రపంచాన్ని అన్వేషిస్తారు. సరికొత్త జీవితాన్ని అనుభవిస్తారు! చివరికి దాని లోతు అర్ధమవుతుంది. దాని ప్రమాదం ఉత్సాహంగా మారుతుంది..’ అంటూ సముద్రంలో స్విమ్మింగ్‌ చేస్తున్న వీడియోకు క్యాప్షన్‌గా రాసుకొచ్చింది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article