తాజా వార్తలుఅపార్ట్‌మెంట్‌‌ 29వ అంతస్తు నుంచి దూకిన బ్రిటీష్ స్కైడవర్..పారాషూట్ తెరుచుకోక దుర్మరణం

అపార్ట్‌మెంట్‌‌ 29వ అంతస్తు నుంచి దూకిన బ్రిటీష్ స్కైడవర్..పారాషూట్ తెరుచుకోక దుర్మరణం

అపార్ట్‌మెంట్‌లోని 29వ అంతస్తు నుంచి దూకి బేస్ జంపింగ్ చేయాలనుకున్న ఓ బ్రిటీష్ స్కైడైవర్ దుర్మరణం చెందాడు. పారాషూట్ సమయానికి తెరుచుకోక పోవడంతో నేలపై పడి మృతిచెందాడు. థాయ్‌లాండ్‌లో పట్టాయ ప్రాంతంలో శనివారం ఈ ఘటన వెలుగు చూసింది. కేంబ్రిడ్జిషైర్‌లోని హంన్టింగ్టన్‌కు చెందిన నేథన్ ఓడిన్సన్ (33) స్కైడవర్. అతడికి ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. స్కైడైవింగ్ చేయాలనుకునే వారికి సాయపడుతూ ఉంటాడు. తన సాహసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article