హిందూపురం టౌన్
హిందూపురం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వైసిపి ఇన్చార్జి దీపిక అన్నారు. శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మెన్ జబీవుల్లా తో కలిసి దీపిక పట్టణంలోని 22వ వార్డులో రూ.12లక్షలతో మురుగు కాలువ నిర్మాణానికి, 7వ వార్డులో రూ.20లక్షలతో నూతన మురుగు కాలువ నిర్మాణాలకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ,ప్రజల ఓట్లతో గెలచిన ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజాసమస్యలను ఏ మాత్రం పట్టించుకోకుండా సినిమా షూటింగ్ లకు పరిమితమయ్యారన్నారు. కనీసం ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యలు సైతం తెలుసుకోవాడానికి తీరక లేకుండా ఉన్నారని విమర్శించారు. ఈ సారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడో హైదరాబాదులో ఉన్న వారికి కాకుండా నిత్యం ప్రజల మధ్యన ఉంటున్న ఎమ్మెల్యే అభ్వర్థి దీపిక, ఎంపి అభ్వర్థి బోయ శాంతమ్మలకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో కౌన్సిలర్లు ముస్తక్, నాసీర బాను, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫిర్టోస్ ఖలీల్, నాయకులు మన్సూర్, అయూబ్ బేగ్,నౌషాద్, శివ శంకర్ రెడ్డి, షఫి, మల్లిక బాను, తిమ్మారెడ్డి, షాజహాన్, నసీబ్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.