హిందూపురం :హిందూపురం పార్లమెంటు లోకసభకు స్థానిక సీనియర్ కాంగ్రెస్ నేత షాహిన్ (బాటా )… హిందూపురం అసెంబ్లీకి వాల్మీకి నాగరాజులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. షాహిన్ కుటుంబం దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటుంది. బాట… కుటుంబం అంటే గుర్తుకు వచ్చేది కాంగ్రెస్…. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఆయన పేరు దాదాపు ఖరారు చేసింది.. అదేవిధంగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బోయ నాగరాజును అసెంబ్లీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ ఇరువురి అభ్యర్థుల ఎంపిక విషయంలో రాష్ట్ర మాజీ మంత్రి.. ఏఐసిసి కోర్ కమిటీ సభ్యులు ఎన్ రఘువీరారెడ్డి ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది.