కోటనందూరు.
తెలుగుదేశం జనసేన కూటమి మరో నెలలో అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని తేలిపోయిందని అందుచేతనే ఆ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని ఆయన అన్నారు. కోటనందూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గాడి రాజబాబు అధ్యక్షతన తాటిపాకలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. సుర్ల రాంబాబు ఆధ్వర్యంలో తాటిపాక కు చెందిన పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి యనమల కృష్ణుడు పసుపు కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు దంతులూరి చిరంజీవి రాజు, అంకంరెడ్డి రమేష్,లెక్కల భాస్కర్,అంకారెడ్డి సత్యనారాయణ, కుచ్చర్లపాటి అరవింద్ వర్మ,పోతల సూరిబాబు,బంటుపల్లి వెంకటేశ్వరరావు, పెనుమత్స నాగేశ్వరరావు,గెడ్డం కొండయ్య నాయుడు,వేగి గోపి బయలపూడి శ్రీరామ్మూర్తి,వాసం నాగేశ్వరరావు,మాతి రెడ్డి నూకరాజు,ఎర్రా సత్యనారాయణ , లగుడు సత్యనారాయణ, అంకారెడ్డి వెంకటేష్ , బోడపాటి సత్యనారాయణ,జనసేన పెనుమత్స ప్రవీణ్, కూనిశెట్ట నాగేశ్వర్రావు,అభిషేక్, తదితరులు పాల్గొన్నారు