పులివెందుల :సేంద్రియ ఎరువుల వాడకం వలన రైతులకు అధిక దిగుబడి తో మంచి లాభాలు చేకూరుతాయని నవ భారత్ ఫర్టిలైజర్స్ ఫీల్డ్ ఆఫీసర్ లు శ్రీకృష్ణ,నాగేంద్ర లు అన్నారు. బుధవారం పులివెందుల మున్సిపా లిటి పరిధిలోని చిన్న రంగాపురం, బ్రాహ్మణ పల్లె, లింగాల మండలం ఇప్పట్ల,చిన్నకుడాల గ్రామాలలో రైతు సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట సాగులో రసాయన ఎరువులు అధికంగా వాడటం వలన ఆహార ఉత్ప త్తులు విషతుళ్యం అవుతాయన్నారు. రసాయన ఎరువులు వాడకం వలన క్రమక్రమంగా భూమిలో భూసారం తగ్గిపోయి,పంట దిగుమతులు తగ్గి పోతాయన్నారు. మానవ,జంతు మనుగడకు ముప్పు కలిగిస్తాయని పేర్కొన్నారు. సేంద్రియ జీవన ఎరువులు వాడడం వలన పెట్టుబడులను తగ్గించవచ్చునన్నారు. అలాగే అధిక దిగుబడి సాధించవచ్చునని తెలిపారు. నవభారత్ ఫర్టి లైజర్స్ సేంద్రియఎరువులు పంటలకు వాడడం వలన భూమిలో మిత్ర పురుగులు అయినటువంటి సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది మొక్కలకు కావల సిన పోషకాలను అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయన్నారు. నవభారత ఫర్టిలైజర్ సంస్థ 20 సంవత్సరాలుగా సేంద్రియ జీవన ఎరువులను అందిస్తుందన్నారు.పలు గ్రామాలలో సేంద్రీయ జీవన రైతు అవగాహన సదస్సు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు ఎస్సార్, ఆర్ ఎం ఎస్, బి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
సేంద్రియ ఎరువుల గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్న కృష్ణ

