ప్రజాభూమి హనుమంతునిపాడు
హనుమంతునిపాడు మండలంలోని సీతారామపురం గ్రామంలో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ సభ్యులు మరియు స్థానిక శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనగా అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు హారతులతో ఆదరాభిమానాలు చూపగా కార్యకర్తలు పూల వర్షం కురిపించారు.ఈ గ్రామం రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచేరువు సత్యనారాయణ రెడ్డి స్వగ్రామం కావటం గమనార్హం అని ఇంతటి ఘనస్వాగతం పలికి నాపై ఆదరాభిమానాలు చూపుతున్న మీకందరికి ఎల్లవేళలా ఋణపడి ఉంటానని శాసన సభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ తెలిపారు. గ్రామంలో గడప గడపకు తిరుగుతూ జగనన్న లబ్దిదారులకు చేసిన మేలు గురించి వివరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిస్కారానికై అధికారులకు ఆదేశాలు ఇస్తూ ముందుకు సాగారు. నవరత్నపధకాలతో నవ్యాంధ్రప్రదేశ్ దిశ దశ మార్చారని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో నైనా ఒకటవ తేది ఉదయాన్నే వాలంటీర్ ద్వారా పింఛన్ లబ్దిదారునికి అందిస్తున్నారా, ఎప్పుడైనా రేషన్ సరుకులు మన బజారులో మన ఇంటి ముందుకే తెచ్చి ఇవ్వటం జరిగిందా, వ్యవసాయ సీజన్ కు ముందు రైతులకు పెట్టుబడికోసం రైతు భరోసా అందించారా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు జగనన్నకే సాధ్యమని అందుకే ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి మాత్రమే అవసరమని తెలిపారు. ఇంతకు ముందు ముఖ్యమంత్రులు చేయని పనులు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయటం గాని గతంలో ఆగిపోయిన డీఎస్సి అభ్యర్థులకు పోస్టులు ఇవ్వటం గాని ఒక్క జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమైందని చెప్పారు. పధకాలకు లబ్దిదారుడు అర్హత కలిగివుంటేచాలని కులం మతం పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని అందుకే జగనన్న దైర్యంగా మీరు లబ్దిపొందితేనే మీ బిడ్డను దీవించి ఓటేయమని అడుగుతున్నారన్నారు.గ్రామంలో ఒకరిద్దరు లబ్ది పొందితే అది తెలుగుదేశం ప్రభుత్వం అని గ్రామమంతా లబ్దిపొందితే అది వైస్సార్ ప్రభుత్వం అని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని భావితరాల భవిష్యత్ కోసం నాడు నేడు కింద పాఠశాలలు సుందరీకరించారని ఇంగ్లీష్ మీడియం పెట్టి విద్యార్థులకు జగనన్న మేనమామ గా మారారన్నారు. ప్రతి అక్కాచెల్లమ్మలు లబ్ధిపొందే విదంగా అమ్మవాడి విద్యాదీవెన వసతిదీవెన జగనన్నతోడు ఇలా పధకాలను ఇస్తున్నారని మధ్యలో దళారి వ్యవస్థ లేకుండా డైరెక్ట్ గా లబ్దిదారుని ఖాతాలో జమచేయటం జరుగుతుందని గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ముందుకు పాలన వచ్చిందన్నారు. సామాజిక సాధికారత ఈ ప్రభత్వంలోనే జరిగిందని బిసి ఎస్సి మైనారిటీలను ఉప ముఖ్యమంత్రులుగా మంత్రులుగా చేయటమే కాకుండా యాబై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్ లుగా డైరెక్టర్ లుగా పదవులు ఇచ్చి గౌరవించారని గుర్తుచేశారు. బిసి బిడ్డనైన నన్ను జగనన్న ఎంతో ఆదరించి 2014లో టికెట్ ఇవ్వగా ఓడి పోయినప్పటికీ మరలా2019లో నాపై నమ్మకంతో టికెట్ ఇచ్చారని మీరుకూడా కనిగిరి నియోజకవర్గములో ఎన్నడూ లేనంత భారీ మెజారిటీతో గెలిపించారని అప్పటినుంచి జగనన్న నాకు తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సభ్యునిగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎస్వీబీసీ ఛానల్ సభ్యునిగా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యునిగా ఇచ్చి ఆదరించిన విషయం మీకందరికి తెలుసని పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతటవే వస్తాయని తెలిపారు. హనుమంతునిపాడు మండలం వైస్సార్ పార్టీ కంచుకోటని కాబట్టి బూత్ కన్వీనర్లు సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు గృహసారధులు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి కుటుంబానికి వెళ్లి వారు పొందిన లబ్ది గురించి తెలియజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాయం సావిత్రి మాజీ ఎంపీపీ గాయం బలరామిరెడ్డి వైస్సార్సీపీ మండల అధ్యక్షుడు మరియు సింగల్ విండో చైర్మన్ యక్కంటి శ్రీనివాసరెడ్డి యూత్ అధ్యక్షుడు దాసరిపల్లి సర్పంచ్ భవనం కృష్ణారెడ్డి మండల సచివాలయ కన్వీనర్ మద్ది తిరుపతయ్య మరియు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.