- ఈ నెల 23న ఉరవకొండలో నాలుగవ విడత నిధులు విడుదల
- వైస్సార్ ఆసరా మహిళలకు భరోసా ఇచ్చింది
- పాదయాత్రలో ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకున్నారు
- ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, పార్టీ ప్రోగ్రాం అబ్జర్వర్ ఎంఆర్సి రెడ్డి
అనంతపురము (ఉరవకొండ):
డ్వాక్రా మహిళల రుణమాఫీ లో భాగంగా రూ.6, 350 కోట్లు నిధులు విడుదల చేసేందుకు మంగళవారం ఉరవకొండకు సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని, ఈ సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, పార్టీ ప్రోగ్రాం అబ్జర్వర్ ఎంఆర్సి రెడ్డి ప్రజలను కోరారు. సోమవారం స్థానిక భారత్ పెట్రోల్ బంకు సమీపంలో సీఎం సభా ఏర్పాట్లను విశ్వేశ్వరరెడ్డి, ఎంఆర్సి రెడ్డి, యువనేత వై.ప్రణయ్ రెడ్డి తదితరులు పరిశీలించారు. అక్కడి నుంచి హెలిప్యాడ్ వద్దకు వెళ్లి చూసారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాడు ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉరవకొండకు వస్తున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సభలో వైస్సార్ ఆసరా కింద 4వ విడతకు సంబంధించిన రూ.3.350 కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందులో అనంతపురం జిల్లాకు రూ.359 కోట్లు ఆయా మహిళల ఖాతాల్లో జమ చేస్తారన్నారు. కావున పార్టీ శ్రేణులు ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. తమ ప్రభుత్వం వచ్చే నాటికి ఎంతైతే ఉందో దాన్ని నాలుగు విడతల్లో చెల్లిస్తామని ప్రజా సంకల్ప పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారని, నాలుగో విడత జమతో ఇచ్చిన హామీని పూర్తి చేసి వైస్సార్ ఆసరా కింద మొత్తం రూ.25 వేల కోట్లు మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నారని వెల్లడించారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ శ్రీనాత్ రెడ్డి, కమ్మ, కురుబ, ఎంబిసి కార్పొరేషన్ల డైరెక్టర్లు తేజోనాథ్, గోవిందు, వెంకటేష్, మాజీ ఎంపీపీ చంద్రమ్మ, మాజీ జెడ్పిటిసి తిప్పయ్య, పెన్నహోబిలం మాజి చైర్మన్ అశోక్, పార్టీ రూరల్ అధ్యక్షుడు సుంకన్న, పట్టణ అధ్యక్షుడు ఏసీ ఎర్రిస్వామి, పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు బసవరాజు,ఉప సర్పంచ్ వన్నప్ప,పిఏసీఎస్ చైర్మన్ షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.