పులివెందుల
రాప్తాడు లో జరిగే సిద్ధం సభకు మేము సిద్ధమని నాలుగో వార్డు గాంధీ నగర్ యువకులు శుక్రవారం ముందుకు వచ్చారు. ఆదివారం అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహి స్తున్న సిద్ధం సభకు తరలి వెళ్లేందుకు మేము కూడా సిద్ధం అని వారన్నారు. ఈ సందర్భంగా 4వ వార్డు కౌన్సిలర్ జేసిఎస్ ఇంచార్జ్ పార్నపల్లి కిషోర్ మాట్లా డుతూ జరగబోయే ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహి స్తున్న సిద్ధం సభకు భారీగా తరలి వెళ్లడం జరుగు తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే వారిలో ఉత్సాహాన్ని నింపు తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించే సభల కు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నార న్నారు. ఆదివారం రాప్తాడు లో జరిగే సిద్ధం సభకు కూడా పులివెందుల నియోజ కవర్గం నుండి వైకాపాశ్రేణులు భారీగా తరలి వెళుతున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా 4వవార్డ్ నుండి కూడా భార్యగా జనాలతో తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. ప్రజలు భారీ సంఖ్యలో సిద్ధం సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.