తాజా వార్తలుసప్పలమ్మ ఆలయ నిర్మాణానికి ఆర్దిక సహకారం.

సప్పలమ్మ ఆలయ నిర్మాణానికి ఆర్దిక సహకారం.

లేపాక్షి: మండల పరిధిలోని సి వెంకటాపురం గ్రామంలో నూతనంగా నిర్వహిస్తున్న సప్పలమ్మ దేవాలయ నిర్మాణానికి బెంగుళూరులో స్థిరపడ్డ బిసల మానేపల్లి వాసి బీఏ జయప్రకాష్ కుటుంబ సభ్యులు 71 వేల రూపాయలను ఆర్థిక సహకారం అందజేశారు. బిసలి మానేపల్లి గ్రామానికి చెందిన బిఏ జయప్రకాష్ బెంగళూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సి వెంకటాపురంలో నిర్మిస్తున్న సప్పలమ్మ దేవాలయ నిర్మాణానికి ఆర్దిక సహకారం అందించాలని కమిటీ సభ్యులు బి ఏ జయప్రకాష్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన జయప్రకాష్ ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ కమిటీ సభ్యులకు 71 వేల రూపాయలను అందజేశారు. దీంతో వెంకటాపురం గ్రామ ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎం ప్రభాకర్, నారాయణస్వామి,వెంకటరెడ్డి, నారాయణస్వామి ,మూర్తి, శివప్ప, గంగాధర్ ,తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article