మార్కాపురం :మార్కాపురం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మార్కాపురంలోని రెడ్డి మహిళా జూనియర్ కళాశాలలో ఆదివారం నాడు “పర్యావరణం పై రంగులు, ప్లాస్టిక్ ప్రభావం” అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ బి శరత్ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు ఏనుగుల రవికుమార్ మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం వల్ల నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయన్నారు. అత్యధిక ఉష్ణోగ్రత వల్ల సకాలంలో వర్షాలు కురవక పోవడంతో కరువుతో విలయతాండవం చేస్తాయన్నారు. ఉష్ణోగ్రతలు తగ్గేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని పెంచి పోషించాలన్నారు. కావున వాయు, జల, భూగర్భ కాలుష్యం కాకుండా ప్రకృతిని భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రెడ్డి మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రావి గాయత్రి, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు సయ్యద్ రఫీ, ఉదయగిరి వెంకట్రావు, మండల నాయకులు ఆర్ విప్లవ కుమార్, ఏనుగుల శివ, దూదేకుల రసూల్, మండ్ల శ్రీనివాసులు, వడ్డే రవికాంత్ ,కంభం సి ఎల్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గుండాల ముక్తేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.