చంద్రగిరి:తిరుపతి రూరల్ మండలం సప్తగిరి నగర్ పంచాయతీ పరిధిలో సోమవారం “మీతోనే మీ మోహిత్” కార్యక్రమాన్ని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నిర్వహించారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ సారథి జగనన్నకు మరోసారి పట్టం కట్టాలని, అందుకు చంద్రగిరిలో తన అన్నయ్య మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ శివార్లలో స్థానిక ప్రజలు హర్షిత్ రెడ్డికి హారతులు పట్టి సాదరంగా ఆహ్వానించి గజ మాలతో సత్కరించారు. కరోనా సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి చేసిన మేలును స్థానిక జనం గుర్తు చేసుకుని మోహిత్ ను ఆశీర్వదిస్తామని మాట ఇచ్చారు.
చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి చేసిన అభివృద్ధి, జగనన్న ప్రభుత్వం అందించిన సంక్షేమం గురించి హర్షిత్ రెడ్డి వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. గ్రామాల్లో రాజకీయ కక్షలకు అవకాశం లేకుండా అందరినీ సమానంగా చూసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి తీరు పట్ల అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి బిడ్డను తమ ఇంటి బిడ్డగా ఆదరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
