శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు విచ్చేసిన స్వామీజీకి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆలయంలోని ఆశీర్వచనం మండపంలో అర్చకులు, వేదపండితులు వేదాశీర్వచనం వల్లించి దేవస్థానం అధికారులు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

