Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుశ్రీ మల్లాలమ్మ తల్లి 3వ వార్షికోత్సవ జాతర

శ్రీ మల్లాలమ్మ తల్లి 3వ వార్షికోత్సవ జాతర

హాజరైన పులివర్తి నాని

చంద్రగిరి:
చంద్రగిరి మండలం పరిధిలోని మిట్టపాలెం మిట్టపాళ్యం వద్ద మేదర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మల్లాలమ్మ తల్లి జాతరకు మేదర (మహేంద్ర) సంఘం సభ్యులు ఆహ్వానం మేరకు చిత్తూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని హాజరయ్యారు. ముందుగా పులివర్తి నానిని శాలువాతో సత్కరించి గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పులివర్తి నాని మల్లాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు . పులివర్తి నాని మాట్లాడుతూ మలాలమ్మ తల్లిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గo లోని ప్రజలందరూ ఆయురారోగ్యలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు నాని తెలిపారు. అనంతరం మేదర సంఘం సభ్యులుపులివర్తి నానికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షుడు పల్లి లేని సుబ్రహ్మణ్యం నాయుడు, ఈశ్వర్ రెడ్డి, గౌస్ భాష, ప్రవీణ్ రాయల్ , ప్రవీణ్ రాయల్ , తులసి రెడ్డి ,డిష్ గోపీనాథ్ ,శంకర్, హుస్సేన్, టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article