బుట్టాయగూడెం:బుట్టాయగూడెం గ్రామదేవత శ్రీశ్రీశ్రీగంగానమ్మ ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. గంగానమ్మ ఆలయంలో మంగళవారం గంగానమ్మ ఆలయంలో మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన హనుమాన్ చాలీసా పారాయణం మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగింది. స్థానిక కొత్తపేటకు చెందిన శేషాద్రి మహిళా భజన మండలి, శ్రీ కోదండ రామాలయం మహిళా భక్త బృందం 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఇందుకూరి రాజబాబు, నడింపల్లి గంగాభవాని, అనంతాత్మకుల రవిబాబు, మండవల్లి ఆది వెంకట సత్యనారాయణ, తదితరులు పర్యవేక్షించారు.