Thursday, May 1, 2025

Creating liberating content

Uncategorizedశభాష్.. చంద్రన్న…

శభాష్.. చంద్రన్న…

స్వేచ్ఛకు కూడా హద్దులుంటాయిగా..
*సస్పెండ్, కేసంటే తప్పయిందని అనడం…
*చెప్పుతో కొట్టి గోదానం చేస్తే సరిపోతుందా…
*విమర్శించు అది సహేతుకంగా. ఉండాలి…
*స్థాయి తప్పి ప్రవర్తిస్తే శిక్ష పడాల్సిందే…
*నేడు చేసింది నాడు జగన్ చేసింటే…
*ఈ చిల్లర రాజకీయాలు ఇలా ఉండెవి కావుగా…
*రాజకీయ పరిపక్వత లేకపోతే రాక్షసత్వం వస్తుందే…
*కారు కూతలు కూసి కాళ్ళు పట్టుకుంటావా…
*బాబు దార్శనికత ను దెబ్బతీయడం కాదా…
*మహిళ అంటే ఏ పార్టీఅయిన మహిళే…
*పాలసీని విమర్శించు…పరువు తక్కువ కూతలు కాదు…
*ఇలాంటి వారితోనే పార్టీల పరువు పోయేది…
*జగనన్న ఇక నైన ఆలో చించు…
*మీ సోషియల్ మీడియాను నియంత్రణ చేయండి…
*అసలు ఈ “ట్యూబ్” లపై నియంత్రణ చేస్తే…
*ఇదే కదా విలువల్లేని జర్నలిజం…
*ప్రాథమిక పరిజ్ఞానం లేని జర్నలిజం కూడా ఒక జర్నలిజమేనా…
*కొన్నింటికి టిజి సీయం రేవంత్ రెడ్డే కరెక్ట్…
*నాయకులారా ఆలోచన చేయండి….
*నీచమైన సంస్కృతి కి స్వస్తి పలకండి….
*పాలక పక్షమా పటిష్ట చర్యలు చేపట్టండి ..
*ప్రజాస్వామ్య విలువలు కాపాడండి…
*పరువు తక్కువ పనులొద్దు… ప్లీజ్…
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
మనది విశాలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరికీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనేవి చాలా మెండుగానే ఉన్నాయి.కానీ ఇటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో కలుపుమొక్కలుగా చేరి పైకి ఎదగడం కోసం రాజకీయం అనే ముసుగు వేసుకున్న కొంతమంది నీచ కుటిల బుద్ది కలిగి చదువు కున్న మేధావుల్లాగ ఉన్న ప్రబద్దులు చేసే వ్యర్థ ప్రసంగా లతో రాజకీయాలు భ్రష్ఠుపట్టి పోతున్నాయని చెప్పడం లో సందేహం లేదు.78 ఏళ్ల స్వతంత్ర్య భారత వనిలో ఎందరో పుట్టారు గిట్టారు.కానీ ప్రపంచం ఏంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నా సగటు మనిషి ఆలోచన విధానంలో మార్పు అనేది రాకపోవడం దురదృష్టవకరం.ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న సూక్తి రాతల కే పరిమితం అయి పుస్తకాల్లో నిక్దీప్తమై ఉండటం తప్ప మనుషుల మస్తిస్కమ్ లోకి ఎక్కించుకోక పోవడంతో మానవ తప్పిదాలు బోలెడు జరుగుతున్నాయి
ఇంతకీ ఏమిటా ఇది అంటే…ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షణాల్లో తీసుకున్న గొప్ప నిర్ణయం కు ఆయన్ని ఎన్ని విధాలుగా మెచ్చుకున్న అది అతిశయోక్తికాదు. ఐటీడీపి నేత కిరణ్ మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి పై చేసిన ఆనుచిత వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా చలించిన ముఖ్యమంత్రి వెంటనే కిరణ్ ను సస్పెండ్ ఆపై అరెస్ట్ కూడా చేయమని అదేశాలు ఇవ్వడం ఆయన దార్శనికత ను తెలియజేస్తుంది.ఒకవైపు రాజకీయాల్లో ఇలాంటి హుందాతనం కలిగిన నాయకులు ఉండటం సంతోషంగా భావిస్తూ మరోవైపు అదే రాజకీయల్లో నైతిక విలువలు, కుటుంబ విలువలు లేని వారు ఉండటం కూడా చూస్తే అసహ్యంతో పాటు ఒకింత ఆవేదన కలుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న రాప్తాడు పర్యటన లో పోలీసుల పై చేసిన వ్యాఖ్యలకు అటు సంబంధిత అధికారులు,హోమ్ మంత్రి ఇతర ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా అవి కూడా కొంత సమాజ హితం లేక పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఇంతేలే అనుకోవడంతో సరిపోయింది.
ఇదంతా రాజకీయ చదరంగంలో సాధారణం అయినప్పటికీ పెరిగిన పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం తో స్వేచ్ఛ అన్న అర్థం కూడా సరిగా తెలియని పవిత్రమైన జర్నలిజం ఇప్పటికే బ్రష్టు పట్టి పోతున్న తరుణంలో విలువలు విశ్వసనీయత లేని చదువుకున్న కొందరు అజ్ఞానులు యూట్యూబ్ ల పేరుతో విశ్లేషకులు తా అవతార మెత్తిన కొందరితో చర్చా కార్యక్రమాలు పెట్టడంతో ఇటు ట్యూబ్ లు ఆటు ఈ నవీన విశ్లేషకులు వారి ఇష్టానుసారంగా మాట్లాడం జరుగుతోంది. అందులో భాగమే ఐటీడీపి నేత కిరణ్ సస్పెండ్,అరెస్ట్ ఉదంతం.
ఇతను గొప్ప మేధావి కావచ్చు.. ఒక పార్టీ బాధ్యతలు చేపట్టిన తరువాత స్థాయి ఎదయున సమాజ నిర్మాణానికి అవసరమైన మేరకు నడవడిక ఉండాలే తప్ప ప్రతిపక్షాలు ఏది చేసిన వారికి సహేతుకంగా విమర్శలు చేయాలే తప్ప వ్యక్తి గత దూషణ అనేది చాలా ప్రమాదం అన్న కనీస జ్ఞానం లేకుండా ఒక మహిళ పై ఇలా చేయడం క్షమించారనిదే అవుతుంది.వైఎస్ జగన్ వైసీపీ పార్టీ విధానాలు నచ్చలేదు కాబట్టి ప్రజాతీర్పు ఇచ్చారు.. అందుకే ప్రతిపక్ష హోదా లేదు.కేవలము విధానపరమైన అంశాలపై అనేక మార్లు మాట్లాడిన పర్వాలేదు కానీ ఒక కుటుంబ సభ్యులను దారునాతి దారుణంగా అవమాకరంగా మాట్లాడటం అనేది చాలా పెద్ద తప్పే అవుతుంది.
ఇక్కడ విజ్ఞులైన ప్రజలు రాజకీయ నాయకులు మేధావులు ఆలోచన చేయాలి. పవిత్రమైన దేవాలయం లాంటి శాసనసభ, శాసన మండలి లో కూడా కుటుంబ విలువలు దిగజార్చి మాట్లాడం నీతి మాలిన చర్యే అవుతుంది.గత ప్రభుత్వ హయాంలో ఉభయ సభల్లో కూడా మంత్రులు,అంతకుముందు టిడిపి సభ్యులు కూడా విచక్షణ అన్నది కోల్పోయి మాట్లాడటం జరిగింది. అంటే రాజకీయం అంటే ఏదయినా చేయొచ్చు మో అన్న ఆలోచన కు ఈ నేతల మాటలు అనిపించాయి.అందుకే ఈనాడు ఈ సమాజం ఇలా తగలదడిందని కొందరు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి వివాస్పద వ్యాఖ్యలు మూలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్డిగా మీడియా పై సహనం కోల్పోయి విమర్శలు చేయడం జరిగింది. అంటే మీడియా అన్నది కూడా సమాజ హితం కోసం కాకుండా వారి హితం కోసం చూసుకుని
రాజకీయ పార్టీల చేతుల్లో కీలు బొమ్మలుగా మారి వారికి మోకరిల్లడం తో నేడు అనేకమైన శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు.కావున ఇప్పటికయిన ప్రబుత్వ పెద్దలు ,రాజకీయ నాయకులు అది ఏ పార్టీ వారైన సంస్కరణలు తీసుకొచ్చి ప్రజా ప్రయోజనాల కోసమే నిజాయితీగా పనిచేస్తూ మిగిలిన వ్యవస్థలను కూడా నీతి వంతంగా ఉండేలా చూడాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article