పార్టీ ఏదైనా ఎంచుకున్న అంశం సరైనదే
*నేరగాడికి ఉరి శిక్ష వేసినా తప్పులేదు…
*కొట్టి చంపడం అన్నది తప్పే …
*మీ న్యాయ పోరాటం మంచిదే…
*ఇది రాజకీయ అంశంగా ముడిపెట్టకుంటే మంచిదే..
*ఇది ఏ రాజకీయం అయినా తప్పు తప్పే…
*చంద్రన్నకు మచ్చ తప్పక పోయే…
మద్దెల గురుమూర్తి విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నపటినుండే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తరచూ కలిసి వచ్చేవారు. వైఎస్ మరణానంతరం జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో ఆయన సోదరి షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టగా ఆమె వెంటే ఉన్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2017లో చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో (2017 నవంబరు- 2019 జనవరి) వరకు 3,648 కి.మీ ఈ పాదయాత్రలో వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ గా జగన్ తో పాటు ఉన్నాడు.
డా.గురుమూర్తి 2021లో తిరుపతి లోక్సభ నియోజకవర్గంకు జరిగిన ఉపఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పై 2,30,572 ఓట్ల మెజారిటీతో గెలిచి రాజకీయ ప్రస్తానం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ (లాకప్ డెత్) కేసు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఉన్నత స్థాయి పోలీసు అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాలని ఎంపీ మద్దిల గురుమూర్తి సుప్రీంకోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ కేసులో కేవలం కింది స్థాయి పోలీసులపైనే చర్యలు తీసుకుంటున్నారని, అసలైన ఉన్నతాధికారులను తప్పిస్తున్నారని ఎంపీ మద్దిల గురుమూర్తి ఆరోపించారు.సాయికృష్ణ అదృశ్యం, కస్టోడియల్ డెత్ మరియు డిజిటల్ ఆధారాల ధ్వంసం వెనుక ఉన్నతాధికారుల పాత్రపై విచారణ జరపాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.ఇందులో భాగంగా ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు, ఏసీపీ కె. మానసలపై విచారణ జరపాలని లోయర్ కోర్టు (మేజిస్ట్రేట్ కోర్టు) ఆదేశించింది.అయితే, ఈ ఆదేశాలపై ఏపీ హైకోర్టు స్టే విధించడంతో, ఎంపీ గురుమూర్తి హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు..వాస్తవానికి ఎంపి గురుమూర్తి ఎంచుకున్న అంశం సరైనదే అయినప్పటికీ దీనిని కూడా రాజకీయ పరమైన అంశాలతో ముడిపెట్టకుండా అధికారం లో ఉన్న పార్టీలు నిష్పాక్షికంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటే ప్రజలు కచ్చితంగా హర్షించక తప్పదు.జరిగిన సంఘటన లో ముద్దాయి గాదె సాయి కృష్ణ ఎంతటి నేర చరిత్ర కలిగి ఉన్నప్పటికీ ఆ కేసు ఈ సమాజానికి చాలా ఇబ్బంది కరమైన విషయం అయినా నేరాల నియంత్రణలో కాస్త కఠినంగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ కాటికి పోయేంత పని చేయడం అన్నదే ఇక్కడ ప్రధాన చర్చ.ఈ జరిగిన ఉదంతం సరైనది కాదనే భావన సామాన్యుడి నుంచి వ్యక్తం అవుతున్న తరుణంలో రాజకీయ పరమైన అంశాలతో ముడిపెట్టకుండా సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన వ్యక్తి వైసిపి పార్టీ ఎంపీ అయినా బాధ్యతగల పార్లమెంట్ సభ్యుడిగా ప్రవర్తించడం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.వైద్య వృత్తిలో ఉంటూ రాజకీయ నాయకుడైన వివాస్పద అంశాల జోలికి వెళ్లకుండా ఉండడం గురుమూర్తి కి కలిసి వచ్చిన అంశం గా చెప్పవచ్చు.

