ప్రొద్దుటూరు
స్థానిక నియోజకవర్గ పరిధిలో తెలుగు దేశం పార్టీ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కుమారుడు, యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక నెహ్రూ రోడ్ లో ఉన్న వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎప్పుడూ తన తండ్రి వరదరాజుల రెడ్డి అధికారం కోసం పాకులాడలేదని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టి పారేశారు. బ్రేకింగ్ న్యూస్ పేరుతో తనకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చారని వైరల్ కావడంలో తన ప్రమేయం నయాపైసా కూడా లేదన్నారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా లింగారెడ్డి మీడియా సమావేశం లో అవాకులు చవాకులు పేలడం సరి కాదన్నారు. పార్టీ ప్రయోజనాల కోసం తాము అంకితమై ఉన్నామని వివరించారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.