ప్రొద్దుటూరు వైసీపీ కే తమ సంపూర్ణ మద్దతని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోస మనోహర్ ప్రజలను కోరారు. మంగళవారం ఆయన స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్డీయే కూటమికి ఓటు వేయరాదని, వైయస్సార్సీపి పార్టీని గెలిపించాలని కోరారు. దేశంలో మతోన్మాద పరిస్థితులను తయారు చేసే విధంగా బిజెపి వ్యవహరిస్తోందని, రాష్ట్రంలో బిజెపి జనసేన టీడీపీ పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారాన్ని చేజేక్కించుకోవాలని చూస్తున్నాయని, దేశంలో, రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తాయని విమర్శించారు.
ప్రత్యక్షంగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని బాహాటంగా చెబుతున్నాడని, బిజెపికి ఓటు వేస్తే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని, పరిపాలన చేయడం చేతగాక మతం పేరుతో రెచ్చగొట్టే ధోరణి బిజెపి చేస్తోందని విమర్శించారు. ఎన్డీయే కూటమికి ఓటు వేస్తే బిజెపికి ఓటు వేసినట్లేనని, బిజెపికి ఓటు వేస్తే దళితులకు ముస్లింలకు పూర్వపు గతి పడుతుందని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీలకు ముస్లింలకు జగనన్న చేసిన సంక్షేమ పథకాలను చూసి జగనన్నను గెలిపించాలని సూచించారు. కావున ప్రజలు గమనించి రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు వైసీపీ నే గెలిపించాలని కోరారు.

