- పిసిసి మీడియా చైర్మన్ డాక్టర్. నర్రెడ్డి తులసి రెడ్డి
వేంపల్లె మండలంలోని అలవలపాడు, పాములూరు, అయ్యవారిపల్లి, తదితర గ్రామాలలో పులివెందుల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ధ్రువ కుమార్ రెడ్డితో కలిసి పిసిసి మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి విస్తృతంగా మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా హస్తం గుర్తు మీద ఓటు వేసి కడప ఎంపీగా వైఎస్ షర్మిలమ్మను, పులివెందుల ఎమ్మెల్యేగా ధృవకుమార్ రెడ్డిని గెలిపించవలసినదిగా తులసి రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రామ కృష్ణారెడ్డి, అమర్, రాజా, ఉత్తన్న, రవి, వేమయ్య, బాలం సుబ్బరాయుడు, మాస్, వినయ్, మదార్ తదితరులు పాల్గొన్నారు.

