పులివెందుల
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఉంటున్న పులి వెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వైయస్ భాస్కరరెడ్డిని వికలాంగుల నెట్ వర్క్ రాష్ట్ర అధ్య క్షులు ఇరికిరెడ్డి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో దివ్యాం గులు కలిసి, ఆయన ఆయురారోగ్యాలతో ఉండా లనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వైయస్ భాస్కర్ రెడ్డి వారితో మాట్లాడుతూ అధి కారం ఉన్నా లేకపోయినా, వైఎస్ కుటుంబ సభ్యు లు ఎల్లప్పుడు నిరుపేదలకు, వికలాంగులకు, కార్య కర్తలకు అందుబాటులో ఉంటూ సేవాకార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తారని,ఎవరూ అధైర్యపడవ ద్దని, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని, మళ్లీ మనకు మంచి రోజులు వస్తాయనే ఆకాంక్షను వ్యక్తం చేశా రు. తనను కలవడానికి హైదరాబాద్ వచ్చిన దివ్యాంగులను పేరుపేరునా ఆప్యాయంగా పలక రించి క్షేమసమాచారాలు తెలుసుకున్నారు.అనంత రం దివ్యాంగులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ని కలిసి యోగక్షేమాలు విచారించారు. ఈ కార్యక్రమంలో లింగాల మండల వికలాంగుల సమాఖ్య కార్యదర్శి కర్ణపాపయ్యపల్లె రామాంజనేయులు, కార్యవర్గ సభ్యులు రాజు, బాబు తదితరులు పాల్గొన్నారు.