Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలువైఎస్సార్సీపీలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట

వైఎస్సార్సీపీలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట

జగనన్నే నా ధైర్యం… కార్యకర్తలే నా గుండె ధైర్యం

సామాజిక సమీకరణలో భాగంగా సమన్వయకర్త ఎంపిక
ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి

పుట్లూరు.
వైఎస్సార్సీపీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు.
శింగనమల నియోజకవర్గ నూతన సమన్వయకర్త వీరాంజనేయులు పరిచయ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతపురంలోని కేటీఆర్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త, పెనుగొండ ఎమ్మెల్యే శంకర నారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఆలూరు సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. సామాజిక సమీకరణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సహకారంతో యం. వీరాంజినేయులను నియోజకవర్గ సమన్వయకర్తగా నియామకం జరిగిందన్నారు.
జగనన్న పెట్టిన అభ్యర్థి కోసం తాను, తన భార్య ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇద్దరం ఎన్నికల ప్రచారం చేస్తామన్నారు. పార్టీ శ్రేణులందరి పైన జగనన్న పెట్టుకున్న నమ్మకాన్ని కలిసికట్టుగా నిలబెట్టుకుందామని పిలుపునిచ్చారు. జగనన్నను ఒంటరిగా ఎదుర్కోలేక టీడీపీ, జనసేన, అనేక ఇతర పార్టీలు గుంపుగా వస్తున్నాయన్నారు. వాటన్నిటిని తిప్పి కొట్టి మరోసారి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. శింగనమల సెంటిమెంట్ ని మరోసారి రుజువు చేసి యం. వీరాంజనేయులును ఎమ్మెల్యేగా గెలిపించుకొని జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుందామని కోరారు.
సమిష్టి కృషితో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం: శింగనమల నియోజకవర్గ ఇంచార్జ్ యం. వీరాంజినేయులు
తన లాంటి ఒక సామాన్యుడిని ఇలాంటి వేదిక మీదకు ఎక్కే అవకాశం కల్పించిన దళిత బహుజన అణగారిన వర్గాల దైవం డా. బిఆర్ అంబేద్కర్ కు రుణపడి ఉంటామని వీరాంజనేయులు అన్నారు. దేశ చరిత్రలోనే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి నా ఎస్సీ, నా ఎస్టి, నా బీసీ, నా మైనారిటీ, అంటూ అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుంటున్న అభినవ అంబేద్కర్, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు.
ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన తన మీద నమ్మకంతో ఈ అవకాశంకల్పించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి, ఆలూరు సాంబశివారెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిఊపి నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
ఒక సామాజిక విప్లవం తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ అన్నారు. మరోసారి జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోడానికి మనమందరం కృషి చేయాలన్నారు.
శింగనమల నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే జొన్నగడ్డ పద్మావతి ఎంతో కృషి చేశారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య ప్రశంసించారు.
సామాజిక సమీకరణలో భాగంగా జగనన్న తీసుకున్న నిర్ణయానికి ఎమ్మెల్యే జొన్నగడ్డ పద్మావతి కట్టుబడటం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, చైర్మన్లు , మండల నాయకులు, కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article