గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మంత్రి అమర్నాథ్ ఆరోపణ
విస్తృతంగా మంత్రి అమర్నాథ్ ప్రచారం
గాజువాక: ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్పొరేటర్ తిప్పల వంశిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం 74వ వార్డు నెహ్రూ నగర్, దయాల్ నగర్ లోవ, టీ.ఐ.సీ పాయింట్, క్వారీ రోడ్డు, గౌరి సేవా సంఘం వీధి తదితర ప్రాంతాలలో విస్తృతస్థాయి ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా ఈ ప్రాంతంలోని వినాయక గుడి ఆలయంలో అమర్నాథ్ ఆ వార్డు కార్పొరేటర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు ఉత్సాహంతో అమర్నాథ్ తో పాటు మహిళలు అడుగులో అడుగు వేసి ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలంటూ ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాల గురించి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు స్థానిక మహిళలకు, వృద్ధులకు వివరిస్తూ ముందుకు సాగారు. గడప గడపలో మహిళలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి అమర్నాథ్ కు హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంత గొప్ప పాలనను జగన్మోహన్ రెడ్డి అందించారని, విద్యా, వైద్య రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. తనను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటానని, స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని, విశాఖకు దీటుగా గాజువాకను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే వృద్ధులకు వాలంటీర్ల ద్వారా వారి ఇంటికి వద్దకే పింఛన్ అందజేసే సౌకర్యం కల్పించాలని, సజావుగా సాగుతున్న వాలంటీర్ల వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నాడని ఆరోపించారు. చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ అంటే మొదటి నుంచి కిట్టదని, ఆయన అధికారులకు వస్తే ఈ వ్యవస్థను రద్దు చేయడానికి కూడా వెనుకాడని అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పింఛన్ పంపిణీ చేస్తామని అమర్నాథ్ హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య,తిప్పల గురుమూర్తి రెడ్డి ,వార్డ్ మహిళా అధ్యక్షురాలు సుజాత, ఉమా, జిలకర నాగేంద్ర, గణేష్ ఈరోతు గణేష్, శ్రీను, పోలీస్ నాయుడు, కార్పొరేటర్లు రాజన రామారావు, బొడ్డు నరసింహ పాత్రుడు, శ్రీనివాసరావు , వార్డునాయకులు ఎన్.వై నాయుడు,లోకేష్, త్రినాధ్, ఎస్ రాజారావు,సీకు రమణ.ఒమ్మి ఈశ్వరి, గొరుసు రామలక్ష్మి, నరసింగరావు, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.