మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రం విశ్వంభర. చిరంజీవి నేడు ఈ చిత్రం సెట్స్ పైకి అడుగుపెట్టారు. వాస్తవానికి ఈ చిత్రం షూటింగ్ నవంబరులోనే ప్రారంభమైంది. ఇప్పటివరకు ఇతర సన్నివేశాలను చిత్రీకరించారు. నేడు ప్రధాన షెడ్యూల్ ప్రారంభం కాగా, ఇక నుంచి చిరంజీవిపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. విశ్వంభర చిత్రాన్ని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ ఈ మేరకు అప్ డేట్ ఇచ్చింది. “విశ్వంభర మహా ప్రపంచంలోకి మెగాస్టార్ చిరంజీవి కాలు మోపారు… ఏ లెజెండ్ రైజెస్” అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.