నాది లంచాలు లేని పాలన
గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయిలు నిధులు
తుగ్గలి సిద్దం సభలో జగన్
కర్నూలు:గతంలో లంచాల పాలన ఉండేదని.. గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. ఎన్నిలక ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సీఎం జగన్ బస్సు యాత్ర శనివారం ఉదయం తుగ్గలికి చేరుకుంది. అక్కడి ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందన్నారు.. తుగ్గలి, రాతన పరిధిలో 10వేల జనాభా ఉందని, ఈ రెండు గ్రామాల సచివాలయాల పరిధిలో అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నగదు జమ చేశామన్నారు. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారని, కానీ, వైఎస్సార్సీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశామన్నారు.బటన్ నొక్కడం ద్వారా.. నేరుగా తుగ్గలి, రతన గ్రామాల్లో 95శాతం ఇళ్లకు లబ్ధి చేకూరిందన్నారు. జగన్నన్న విద్యాదీవెన ద్వారా రెండు గ్రామాలకు రూ.2 కోట్లకు పైగా నిధులు అందించామని చెప్పారు. ఒక్క తుగ్గలి పరిధిలో వివిధ పథకాల రూపంలో రూ. 29 కోట్ల 65 లక్షల నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు. . రాతన గ్రామానికి పథకాల రూపంలో రూ. 26 కోట్లు 59 లక్షలు అందజేశామని, అలాగే మనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారాయన.గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం చేసి చూపిస్తున్నాం,గత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలదే రాజ్యం,వలంటీర్ల ద్వారా ప్రతీ పథకం ఇంటి వద్దకే అందేలా చూస్తున్నాం,లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం ఇస్తున్నాం,ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమం అందించాం,గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి,రైతు భరోసా, ఆర్బీకేల ద్వారా రైతన్నలకు అండగా ఉన్నాం,విద్యావిధానంలో మార్పు తీసుకొచ్చాం,ఆరోగ్యశ్రీ పరిధి విస్తరించాం,నాడు-నేడుతో బడుల రూపురేఖలు మారాయి,ప్రతీరంగంలో.. ప్రతీ దశలోనూ మార్పు కనిపిస్తోంది, మంచి కొనసాగాలంటే మీ బిడ్డకు తోడుగా ఉండండి అని సిఎం జగన్ అన్నారు.

