మార్కాపురం :కొనకల మెట్ల మండలంలోని సిద్దవరం గ్రామంలో గల సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్కులను నియోజకవర్గం బిజెపి ఇన్చార్జ్ పివి కృష్ణారావు సందర్శించారు.. ఈ సందర్భంగా ఆయా కేంద్రాలలో గల సమస్యలను సంబంధిత అధికారులు ఆయన దృష్టికి తీసుకురాగా సచివాలయం రైతు భరోసా కేంద్రం విలేజ్ క్లినిక్ లో గల తాగునీటికి మరియు వాడుకునే నీటికి గల సమస్యలను వెనువెంటనే తీరే విధంగా కృషి చేస్తానని కృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు..

