బుట్టాయగూడెం.
నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పత్రికా విలేకరులపై దౌర్జన్య సంఘటనలు దురదృష్టకరమని స్థానిక ప్రెస్ క్లబ్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈనెల 5వ తేదీన చింతలపూడిలో జరిగిన రా.. కదిలి రా!.. తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలో జంగారెడ్డిగూడెం కు చెందిన సీనియర్ జర్నలిస్టులు రమణారావు, శంకర్రావు లపై జరిగిన దౌర్జన్యకర సంఘటనను ఖండించారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేస్తూ బుట్టాయిగూడెం తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యుడు గంజి మధు, సీనియర్ రిపోర్టర్ కడలి గాంధీ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిస్వార్ధంగా పనిచేస్తున్నారని, వారిపై కొందరు దౌర్జన్యకర సంఘటనలకు పాల్పడటం తగదని అన్నారు. ఇటీవల విలేకరులపై జరిగిన దౌర్జన్యకర సంఘటనలపై నిరసన వ్యక్తం చేస్తూ బాధ్యులపై తగిన చర్యలకు డిమాండ్ చేశారు. విలేకరులపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై తగు చర్యలను డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని తహసిల్దార్ సిహెచ్. వెంకటేశ్వర్లు అందించారు. దీనిపై తహసిల్దార్ సిహెచ్ వెంకటేశ్వర్లు స్పందిస్తూ సమాజ హితం కోసం పనిచేసే విలేకరులపై దౌర్జన్య తన సంఘటనలు దురదృష్టకరమన్నారు. సంఘటనలకు బాధ్యులైన వారిపై తగు చర్యలు కోరుతూ ఇచ్చిన వినతి పత్రాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బుట్టాయిగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులు జక్కుల దాసు(ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి), కోడూరి ఆనంద్, మధ్యాహ్నపు శ్రీనివాసరావు, నూకల కాంతినాథ్, శీలం కృష్ణమోహన్, పాముల మురళీకృష్ణ, నిట్టా రవి, కారం భాస్కర్, రామకృష్ణ, తలారి దాసు, ఎన్. శ్రీనివాసరావు, బెంజిమెన్, తదితరులు పాల్గొన్నారు.