అంగన్వాడీ సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. డిమాండ్ల సాధన కోసం 40 రోజులకుపైగా నిరసనలు చేస్తున్న అంగన్వాడీ సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. జనవరి ఐదు లోపు విధులకు హాజరుకాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. పలు మార్లు చర్చలకు కూడా పిలిచింది. అయినా అంగన్వాడీలు దారికి రాకపోగా ఇప్పుడు చలో విజయవాడకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విధులకు హాజరుకాని వారి లిస్ట్‌ను పంపించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. అలా విధులకు హాజరు కాని వారిని అటోమేటిక్ టెర్మినేషన్ చేయాలని సూచించారు.