శ్రీ ఆర్క ప్రారంభోత్సవం సభలోటీడీపీ నేతలు
తుని:తుని పట్టణాన్ని విద్యా రంగంగా అభివృద్ధి పరిచేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్,సుర్ల లోవరాజు అన్నారు. విద్యా మేధావైన ఎమ్మెల్యే యనమల దివ్య పధక రచన చేస్తున్నారని, ప్రభుత్వపరంగా మహిళా నర్సింగ్ కాలేజ్, ఐటిఐ సంస్థలను తీసుకొని రావడంతో పాటు నిరుద్యోగ యువత పోటీ తత్వాన్ని అధిగమించేందుకు సిల్క్ డెవలప్ చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు.అలాగే ప్రైవేటు రంగాన్ని కూడా ప్రొత్సహించడం జరుగుతుందన్నారు.తుని పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఆర్క ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన యనమల రాజేష్, సుర్ల లోవరాజు పలు విభాగాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అంకంరెడ్డి నానబ్బాయి, పవన్ టిడిపి కార్యదర్శి మల్ల గణేష్, తమరాను రామకృష్ణ, స్కూల్ చైర్మన్ అరుణ రామ నాగేంద్ర, జేఎన్టీయూ ప్రొఫెసర్ జివిఎస్పి దీక్షితులు, కాకినాడ సిటీ హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ చినబాబు, స్కూల్ చీప్ అడ్వైజర్ రత్న ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు