పార్టీ ఆదేశిస్తే టీడీపీ తరపున పోటీకి సిద్దం
గొల్లపాలెంలో టీడీపీ నేత రేవు శ్రీను
కాజులూరు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడని అలాంటి నాయకుడు రాష్ట్రానికి ఎంతైనా అవసరమని టిడిపి సీనియర్ నేత పప్పుల మసేను వెంకన్న (రేవు శ్రీను)పేర్కొన్నారు.ఈమేరకు ఆయన బుధవారం కాజులూరు మండలం గొల్లపాలెంలో టిడిపి సీనియర్ నాయకులు చుండ్రు వీర్రాజు చౌదరి ఇంటివద్ద పలువురు రాజకీయ ప్రముఖులతో తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత తొలిసారి సమావేశమయ్యారు.దీంతో ఆయన రాకను తెలుసు కున్న పలువురు పూర్వపు సీనియర్ నాయకులు సైతం ఆయనని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 30 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు టీడీపీలో తనవంతు పార్టీకి సేవలందించడం జరిగిందన్నారు.తాను విద్యార్థి దశనుండే రాజకీయ చైతన్యంతో ముందుండేవాడినని పేర్కొన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటికి తాను సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.దీంతో తమ నేత చంద్రబాబు దృష్టిలో తన పేరు పరిశీలలో ఉన్నట్టు శ్రీను ఈసందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.కాపు సామాజిక వర్గానికి ఇస్తే తప్పకుండా తనకు రామచంద్రపురం టిడిపి టిక్కెట్ ఖచ్చితంగా ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.అలాగే తాను ఏపార్టీలో ఉన్నా పార్టీ సభ్యత్వం తీసుకోలేదని, తాను పరిస్థితుల దృష్యా ఆయా నాయకుల ,నిర్ణయంతో వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూ వచ్చానని అంతే తప్పా పదవులు ఆశించి తాను ఎనాడూ పార్టీలో పనిచేయలేదని శ్రీను ఈసందర్భంగా స్పష్టం చేశారు.అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు దృష్ట్యా తాను మళ్ళీ తెలుగుదేశం పార్టిలో చేరడం జరిగిందని అన్నారు .రాష్ట్రానికి రాజదాని లేని రాష్ట్రంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేసిందని చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడని ఆయనని మళ్ళీ ముఖ్యమంత్రి గా చూడలన్న ద్యేయంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని అన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని ముఖ్యంగా రహాదారులు అద్వాన్నంగా తయారయ్యాయని గుర్తు చేసారు. అలాగే అయనకు తెలుగుదేశం పార్టీలో రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న నాయకులతో ఉన్న పరిచయాలు గుర్తు చేశారు.దీంతో ఇక్కడకు వచ్చిన వారంతా మీరు పార్టీ తరపున టిక్కెట్ తెచ్చుకుంటే తామంతా మీగెలుపుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.దీంతో రేవు శ్రీను నాయకత్వం వర్దెల్లాలని ఈసందర్భంగా నినాదాలు సైతం చేసారు. కార్యక్రమంలో చుండ్రు వీర్రాజు చౌదరి,కోట. తాతబ్బాయి ,సలాది. సాయిబాబా, తోట కృష్ణ,మురార్జీ,నందికోళ్ళ అన్నవరం ,అంగర. కృష్ణ, చిన్న,అంగర శ్రీనివాస్ గౌడ్,అంగర బాబులు ,రవ్వా భూషణం , హనుమంతరావు, అత్తిలి వెంకటరమణ,పలువురు అభిమానులు ,తదితరులు పాల్గొన్నారు